Bigg Boss 5 Telugu: సిరి కత్తి పెట్టుకుని గేమ్ ఆడావ్.. అసలు పాయింట్ తీసిన సన్నీ.. చివరకు..

|

Oct 30, 2021 | 7:28 AM

బిగ్‏బాస్ సీజన్ 5.. ఎనిమిదో వారంలో నామినేషన్ ప్రక్రియ మినహా.. మిగతా వారం రోజులు ఇంట్లో రచ్చ జరిగింది. కెప్టెన్సీ కంటెండర్

Bigg Boss 5 Telugu: సిరి కత్తి పెట్టుకుని గేమ్ ఆడావ్.. అసలు పాయింట్ తీసిన సన్నీ.. చివరకు..
Bigg Boss
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 5.. ఎనిమిదో వారంలో నామినేషన్ ప్రక్రియ మినహా.. మిగతా వారం రోజులు ఇంట్లో రచ్చ జరిగింది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‏తో ఇంట్లో హీట్ కొనసాగింది. ఇంటి సభ్యులు మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరిగింది. అయితే ఈసారి సన్నీకి… త్రిముర్తులకు.. యానీ మాస్టర్‏కు ఓ రేంజ్‏లో ఫైట్ జరుగుతుంది. మొత్తానికి ఈవారం ఇంటి కొత్త కెప్టెన్ అయ్యాడు షణ్ముఖ్. దీంతో శుక్రవారం వరస్ట్ ఫెర్ఫామర్ ఎవరనేది నిర్ణయించాలని ఆదేశించాడు బిగ్ బాస్.

ఇక నిన్నటి ఎపిసోడ్‏లో.. తనకు జరిగిన అవమాన భారాన్ని భరించలేకుపోయాడు.. గేమ్ ఇంకా అయిపోలేదు.. టాస్క్ మాత్రమే అయిపోయింది.. ఇంకా ఆట మిగిలే ఉంది.. ఓడిపోయావ్ అనే మాట గుర్తుపెట్టుకోవాలి… జెస్సీ సంచాలకుడిగా ఎంత చెత్తగా చేశాడో చూశాం కదా.. ఇప్పటి నుంచే కలిసే ఆడదాం అంటూ మానస్‏తో చెప్పుకొచ్చాడు..

ఇక వరస్ట్ పర్ఫామర్..అనేదానిపై ఇంట్లో రచ్చ జరిగింది. మెదటిగా షణ్ముఖ్ కాజల్‏ను వరస్ట్ పర్ఫామర్ అని నామినేట్ చేశాడు.. ఇక ఆ తర్వాత సన్నీ.. జెస్సీని వరస్ట్ పెర్ఫామర్ అని చెప్పగా.. ఇంతవరస్ట్ సంచాలకుడిని ఇప్పటివరకు చూడలేదని చెప్పుకొచ్చాడు.. ఆ తర్వాత లోబో… యానీ మాస్టర్ గివ్ అప్ ఇవ్వడం నచ్చలేదని ఆమె వరస్ట్ అని చెప్పాడు.. ఇక మానస్ కూడా వరస్ట్ సంచాలకుడిగా చేసిన జెస్సీ వరస్ట్ పెర్ఫామర్ అని చెప్పుకొచ్చాడు. ఇక రవి… సన్నీని వరస్ట్ పెర్ఫామర్ అని చెప్పాడు. కాజల్ శ్రీరామ్‏ని వరస్ట్ అని నామినేట్ చేసింది. ఇక సిరి.. సన్నీని నామినేట్ చేస్తూ సంచాలకుడితో సన్నీ ప్రవర్తించిన బిహేవియర్ నాకు నచ్చలేదని చెప్పింది. దీంతో ఆమెకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. నువ్ కత్తి పట్టుకుని గేమ్ లో గెలివాలని చూశావ్..అది మంచి బిహేవియరా అని అడిగాడు. దీంతో సిరి ఫ్యూజుల్ అవుటయ్యాయి. ఇక ఆ తర్వాత యానీ మాస్టర్ గివ్ అప్ ఇవ్వడం నచ్చలేదని ప్రియాంక ఆమెను నామినేట్ చేసింది. ఇక ఆ తర్వాత శ్రీరామ్, విశ్వలు .. కాజల్ వరస్ట్ పెర్ఫామర్‏గా నామినేట్ చేశారు. చివరగా.. యానీ మాస్టర్..తనను ప్రియాంక వరస్ట్ పెర్ఫామర్ అన్నది కనుక.. ప్రియాంకు కూడా వరస్ట్ అంటూ నామినేట్ చేశారు. ఇక మొత్తంగా ఈవారం వరస్ట్ పెర్ఫామర్‍గా సన్నీకి, కాజల్ కు ఎక్కువ ఓట్లు రావడంతో షణ్ముఖ్ ఇంటి సభ్యుల నిర్ణయంతో సన్నీని జైల్లో వేశారు.

Also Read: Punith Raj Kumar: పునీత్ మరణవార్త నమ్మలేకపోయా.. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అంటున్న సుమన్

Niharika Konidela: నిహారిక నిర్మాణంలో కొత్త వెబ్‌ సిరీస్‌.. ‘ఓసీఎఫ్‌ఎస్‌’ అంటే ఏంటో చెప్పేసిన మెగా డాటర్..