అనుకున్నట్టుగానే ఈ వారం శ్వేత ఎలిమినేట్ అయ్యింది. ఆరోవారం నామినేట్ అయిన సభ్యులలో సిరి, శ్వేత డేంజర్ జోన్ లో ఉండగా.. తృటిలో సిరి ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కి.. దీంతో శ్వేత వర్మను ఇంటికి పంపించారు బిగ్ బాస్. ఇక బయటకు వచ్చిన శ్వేత.. ఒక్కో ఇంటి సభ్యునిపై తన అభిప్రాయాన్ని చెప్పేసింది.. అయితే రోడ్డుపై కనిపించే సిగ్నల్స్ ఆధారంగా ఒక్కో ఇంటిసభ్యుడిని పోల్చాలని.. వారి గురించి చెప్పాలిని సూచించాడు నాగార్జున..
ఇందులో డేంజర్ జోన్, టేక్ డైవర్షన్, డెడ్ ఎండ్, దూరంగా ఉండాలి.. ఫ్యూయల్ ట్యాంక్ అంటూ ఇలా కొన్నింటిని బోర్డ్ మీద చూపించాడు.. అందులో మొదట రవి గురించి చెప్పింది.. ఇందులో భాగంగా రవిని మరోసారి బుక్ చేసింది శ్వేత.. రవికి దూరంగా ఉండాలని.. తనకు అనుభవం అయ్యిందని.. తను చాలా స్ట్రాంగ్ అని.. తన గేమ్ తను ఆడుతాడు.. కానీ.. మిగత వాళ్ల ఆటపై ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకొచ్చింది శ్వేత వర్మ. అలాగే.. మానస్ డేంజర్ అని.. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదని.. తను తనకు అర్థం కావడం లేదని చెప్పింది. ఇక ఆ తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ వ్యక్తిగా శ్రీరామచంద్రను పేర్కొంది..ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడని.. చాలా మంచివాడని.. కానీ ఆ మంచితనం ప్రపంచానికి చూపించాలని చెప్పుకొచ్చింది శ్వేత.
ఇక ఆ తర్వాత.. తక్కువ మాట్లాడి ఎక్కువ ఆడాలని యానీ మాస్టర్ కు చూపించింది. ఇక కాజల్ డెడ్ ఎండ్, యూటర్న్ వంటివి ఇచ్చింది.. మాట మారుస్తుందని చెప్పుకొచ్చింది. ఆమె ఎమోషన్స్ పెట్టుకోదు అని తెలిపింది.. ఇక నచ్చిన వారు వెళ్లిపోవడంతో ఆ ఎఫెక్ట్ తనపై పడుతుందని.. విశ్వ గేమ్ నుంచి డైవర్ట్ అయ్యాడని తెలిపింది. మొత్తానికి అనుకున్నట్టుగానే శ్వేత ఎలిమినేట్ అయ్యింది.
Also Read: Bigg Boss 5 Telugu: తృటిలో తప్పించుకున్న సిరి.. ఎలిమినేట్ అయిన శ్వేత.. బోరున ఏడ్చేసిన యానీ మాస్టర్..
Manchu Lakshmi: మేమంతా ఒకటే..పవన్ కళ్యాణ్, విష్ణు చాలాసేపు మాట్లాడుకున్నారంటున్న మంచు లక్ష్మి
Batman: దుమ్ము రేపుతోన్న బ్యాట్‌మ్యాన్ మూవీ ట్రైలర్.. విడుదల ఎప్పుడంటే..?