Bigg Boss 5 Telugu: మరోసారి అడ్డంగా దొరికిపోయిన రవి.. నిజంగానే గుంటనక్క అనేసిన నాగార్జున..

|

Oct 17, 2021 | 6:55 AM

బిగ్‏బాస్ సీజన్ 5 ఆరో వారం ముగింపుకు వచ్చేసింది. వీకెండ్ ఎపిసోడ్ ఫుల్ హీట్‏గా సాగింది.. వారం మొత్తం ఇంటి సభ్యులు చేసిన

Bigg Boss 5 Telugu: మరోసారి అడ్డంగా దొరికిపోయిన రవి.. నిజంగానే గుంటనక్క అనేసిన నాగార్జున..
Ravi
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 5 ఆరో వారం ముగింపుకు వచ్చేసింది. వీకెండ్ ఎపిసోడ్ ఫుల్ హీట్‏గా సాగింది.. వారం మొత్తం ఇంటి సభ్యులు చేసిన తప్పులకు శనివారం నాగార్జున క్లాస్ తీసుకున్నారు. ఇక అక్టోబర్ 16 ఎపిసోడ్ చాలా హీట్ హీట్ గా సాగింది. చేతిలో టెడ్డీ పెట్టి మరీ ఒక్కొక్కరికి క్లాస్ తీసుకున్నాడు..

బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. రావడంతోనే కంటెస్టెంట్స్ పై సీరియస్ అయ్యాడు నాగ్.. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో రవి మరోసారి అడ్డంగా దొరికిపోయాడు.. నిల్చోబెట్టి మరి అందరి ముందు పరువుతీశారు. ఇంటి సభ్యులు ఒక్కరూ కూడా రవికి సపోర్ట్ చేయకపోవడం గమనార్హం. కెప్టెన్‏గా ఉన్న విశ్వను..స్టోర్ రూంకు వెళ్లి కిల్లర్ టెడ్డీని తీసుకువచ్చి.. ఒక్కో ఇంటి సభ్యునికి ఇవ్వమని చెప్పాడు. హౌస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదని తెలియదా అంటూ ప్రశ్నించగా.. తనకు తెలియదని బుకాయించాడు లోబో.. ఎన్నిసార్లు అడిగినా.. ఒకే ఆన్సర్ రావడంతో మళ్లీ అలా జరగకూడదు వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఇక చివరగా కిల్లర్ టెడ్డీ ఇచ్చి క్లాస్ తీసుకున్నారు.. నేను వాళ్లతో తప్పు చేయించి పక్కకు తప్పుకోవాలని అనుకోలేదు సార్ నేను దిండ్లు చింపు కాటన్ తీద్దాం అనుకున్నా.. కానీ కత్తెర కనిపించలేదు.. కానీ శ్వేతా నేనేమీ చెప్పకుండా ఆమె దిండ్లు కట్ చేసి కాటన్ తీసింది. ఆ విషయం నాకు చెప్పకుండానే చేసింది. నేను శ్వేతకు ఆ ఐడియా ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రవికి తెలుసని.. అబద్ధం ఆడుతున్నాడని రివర్స్ అయ్యింది శ్వేత.. నేను పిల్లోలో కాటన్ తీస్తున్న విషయం అతనికి చెప్పాను. అతను ఓకే అని చెప్పాడు.. నీకు తెలియదని చెప్పకు అని నిజం చెప్పింది. నువ్ స్ట్రాటజీలు చేయి రవి తప్పులేదు.. కానీ బ్లేమ్ చేయకు అంటూ సీరియస్ అయ్యారు. రవి కరెక్ట్ చేసాడా అని ప్రశ్నించగా.. ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదు. దీంతో నాగార్జున నీకు ఇప్పుడైనా తెలిసిందా ? తప్పు ఎవరు చేశారో అని నాగార్జున అనడంతో నిజం ఏంటో నాకు తెలుసు సర్.. నాకు అనిపించింది చేస్తా అని అన్నాడు రవి.. ఎవరైనా తప్పు చేస్తే చెప్పడం నా బాధ్యత అది నీకు చెప్తున్నా నీ ప్రవర్తన నీ ఇష్టం అన్నారు నాగార్జున. మొత్తానికి మరోసారి రవి అడ్డంగా దొరికిపోయాడు.

Also Read: Natyam Pre Release Event LIVE: రామ్ చరణ్ ముఖ్య అతిథిగా ‘నాట్యం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్.. డ్యాన్స్‌పై ఇష్టంతోనే గెస్ట్‌గా హాజరవుతున్న చెర్రీ..

Eesha Rebba : తెలుగమ్మాయి పరువాల అందం.. చూడతరమా.. ‘ఈషా రెబ్బ’ న్యూ ఫొటోస్…