Bigg Boss 5 Telugu: రూటు మార్చిన బిగ్‏బాస్.. యాంకర్స్‏ను పక్కనపెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వాళ్లను..

|

Oct 17, 2021 | 8:39 AM

బుల్లితెరపై బిగ్‏బాస్ షో ప్రత్యేకం.. ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను కావాల్సినంత ఎంటర్‎టైన్ చేస్తుంటుంది. ఇక ఇందులో ఎలిమినేషన్స్,

Bigg Boss 5 Telugu: రూటు మార్చిన బిగ్‏బాస్.. యాంకర్స్‏ను పక్కనపెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వాళ్లను..
Preethi Anshu
Follow us on

బుల్లితెరపై బిగ్‏బాస్ షో ప్రత్యేకం.. ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను కావాల్సినంత ఎంటర్‎టైన్ చేస్తుంటుంది. ఇక ఇందులో ఎలిమినేషన్స్, ఫేక్ ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కామన్.. ఇందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చేది ఎవరో తెలుసుకోవడానికి ఆడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్‏లో ఒకేసారి 19 మంది కంటెస్టెంట్స్‏ను ఇంట్లోకి పంపించారు బిగ్ బాస్. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా ? లేదా ? అని నెట్టింట్లో జరిగింది. ఈ క్రమంలో ఒకేసారి డబుల్ ఎలిమినేషన్ అవుతుందని.. ఆ తర్వాత.. యాంకర్ విష్ణు ప్రియ, వర్షిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నారని టాక్ వినిపించింది.

ముఖ్యంగా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా విష్ణుప్రియ రాబోతుందని.. గట్టిగానే టాక్ నడిచింది. అయితే సీజన్ ప్రారంభమయ్యి ఆరు వారాలు గడుస్తున్న ఇప్పటివరకు ఒక్కరిని కూడా ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపలేదు. దీంతో ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదని అంతా అనుకున్నారు.. తాజాగా మరోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తెరపైకి వచ్చింది.. నిజంగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని.. కానీ యాంకర్స్ కాకుండా.. మరో మోడల్ ను రంగంలోకి దించుతున్నట్లుగా టాక్. ఈసారి ఇంట్లోకి ప్రీతి అన్షు వెల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందంటూ నెట్టింట్లో టాక్. దీంతో ఆమె ఎవరో తెలుసుకోవడానికి గాలింపు మొదలు పెట్టారు నెటిజన్స్.. ప్రీతి అన్షు ఒక మోడల్. మై దిల్ అనే షార్ట్ ఫిలింలోనూ నటించింది. అయితే ఎక్కువగా గుర్తింపు లేని ప్రీతిని ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకువస్తున్నారు.. దీంతో నెటిజన్స్ పలు రకాల సందేహలను వ్యక్తం చేస్తున్నారు.. నిజంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందా.. ఉంటే.. ఎలాంటి పబ్లిసిటీ లేని ప్రీతిని ఎందుకు పంపుతున్నారని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. సోషల్ మీడియాలో మాత్రం ప్రీతి పేరు చక్కర్లు కొడుతుంది.

Also Read: Prabhas: ప్రభాస్ రేంజ్ మాములుగా లేదుగా.. సందీప్ వంగా సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్… 

Cruise Drugs Case: ఆర్యన్ ఖాన్ కు బెయిల్ దొరకడం లేదు.. డ్రగ్స్ కేసులో ఇరుక్కుని బెయిల్ పొందిన సీలబ్రిటీల గురించి తెలుసా?

Bigg Boss 5 Telugu: లోబో ఎలిమినేట్.. గుక్కపెట్టి ఏడ్చిన విశ్వ.. అందరి గురించి తెలుసుకోమంటూ లక్కీ ఛాన్స్..