Bigg boss 5 Telugu: తన జర్ని వీడియో చూసి ఎమోషనల్ అయిన సిరి.. షణ్ముఖ్..సిరి కంటెంట్ ఇవ్వడానికే వచ్చారంటూ..

|

Dec 16, 2021 | 6:57 AM

గత రెండు మూడ్రోజులుగా బిగ్‏బాస్ ఇంట్లో హౌస్ మేట్స్ జర్నీ వీడియోస్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సన్నీ, శ్రీరామ్,

Bigg boss 5 Telugu: తన జర్ని వీడియో చూసి ఎమోషనల్ అయిన సిరి.. షణ్ముఖ్..సిరి కంటెంట్ ఇవ్వడానికే వచ్చారంటూ..
Siri
Follow us on

గత రెండు మూడ్రోజులుగా బిగ్‏బాస్ ఇంట్లో హౌస్ మేట్స్ జర్నీ వీడియోస్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సన్నీ, శ్రీరామ్, మానస్, షణ్ముఖ్‏లో జర్నీ వీడియోస్ చూపించగా.. చివరగా నిన్నటి ఎపిసోడ్‏లో సిరి జర్నీ చూపించారు. వైజాగ్. వైజాగ్.. విశాఖపట్నం అంటూ తన ఫోటోలను చూసి సంబరపడిపోయింది సిరి. అందులో కాజల్ ఫోటో కూడా ఉండడంతో ఐ మిస్ యూ అంటూ అరిచేసింది. తన ఫోటోలను చూసుకుంటూ మురిసిపోతున్న సిరిని ప్రశంసలతో ముంచేత్తాడు బిగ్‏బాస్.

సిరి అంటే ఏంటో ప్రపంచానికి చూపాలనే తపన..ఈ ప్రయాణంలో కళ్లకి కట్టినట్టు అందరికీ కనిపించింది. ఈ ఇంట్లో మీరు ఏర్పర్చుకున్న బంధాలు.. దగ్గరైన మనుషులు.. మీలోని ఆ భావాలను తట్టిలేపారు. మీ బుద్దిబలంతో టాస్కులు ఆడి.. ఎవరి కోసం త్యాగం చేయకుండా.. చివరి వరకూ ప్రయత్నించారు. ఇంత ధైర్యంగా ఉండే సిరి వివిధ సంఘర్షణలతో ఒంటరితనాన్ని ఎంచుకున్నారు. మీ కన్నీళ్లు ఆ విషయాన్ని మౌనంగా చెప్పాయి. మీ నవ్వు చేసిన సందడిలో మీ కన్నీళ్లూ ఇంకిపోయాయి. పిట్ట కొంచెం.. కూత ఘనం అనేది మీ విషయంలో నిరూపించారు. సిరి మీ సందడి బిగ్‏బాస్ ఇంటికే కళను తీసుకుని వచ్చింది. బిగ్‏బాస్ భావోద్వేగాల నిధి అయితే.. అందులో సిరి మీరు అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు బిగ్‏బాస్. ఇక తన జర్ని వీడియోలో మరోసారి తన ప్రియుడు చోటును చూపించి.. సిరి వదిలేస్తున్నావా అనే మాటలను మరోసారి గుర్తుచేయగా.. సిరి ఎమోషనల్ అయ్యింది.

ఇక ఆ తర్వాత ఐదారు ఫోటోలను తీసుకుని వెళ్లింది. అయితే షణ్ముఖ్‏ను సర్ ప్రైజ్ చేయడానికి అతడితో దిగిన ఫోటోను డైనింగ్ టేబుల్ దగ్గర దాచేయ్యగా.. బిగ్‏బాస్ ఆ ఫోటోను పట్టుకుపోయాడు. దీంతో ఆ ఫోటో కావాలంటూ షణ్ముఖ్‏ను హగ్ చేసుకోగా.. ఆమెను ఓదార్చాడు. ఆ తర్వాత మనం కంటెంట్ ఇవ్వడం కోసం వచ్చామని మానస్ మాట్లాడుతున్నాడని షణ్ముఖ్‏తో చెప్పగా.. అందుకే వాళ్ల హెల్ప్ తీసుకోవద్దని చెప్తాను అంటూ మరోసారి ఫైర్ అయ్యాడు షణ్ముఖ్

Also Read: Brahmastra: ‘సామాన్యుల ఊహకు అందనిది, ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది’.. ఆసక్తిని పెంచేసిన బ్రహ్మస్త్ర మోషన్ పోస్టర్..

RRR Trailer: రికార్డుల వేటలో దూసుకుపోతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ ట్రైలర్‌.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ సినిమా ఇదే..

Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..