Varshini: ‘రైటర్‌ ఆది, నువ్వు నాకు రైట్‌రా ఆది’.. ఆసక్తిరేకెత్తిస్తోన్న యాంకర్‌ వర్షిణి లేటెస్ట్‌ పోస్ట్‌..

|

Jun 10, 2022 | 8:55 AM

Varshini: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎప్పుడు ఏ అంశం ఎలా వైరల్‌ అవుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితి ఉంది. పోస్ట్‌ చేసిన వారు ఏ ఉద్దేశంతో పోస్ట్‌ చేశారో తెలియకపోయినా ఆ పోస్ట్‌లు మరోలా వైరల్‌ అవుతున్నాయి...

Varshini: రైటర్‌ ఆది, నువ్వు నాకు రైట్‌రా ఆది.. ఆసక్తిరేకెత్తిస్తోన్న యాంకర్‌ వర్షిణి లేటెస్ట్‌ పోస్ట్‌..
Follow us on

Varshini: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎప్పుడు ఏ అంశం ఎలా వైరల్‌ అవుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితి ఉంది. పోస్ట్‌ చేసిన వారు ఏ ఉద్దేశంతో పోస్ట్‌ చేశారో తెలియకపోయినా ఆ పోస్ట్‌లు మరోలా వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇలాంటి రూమర్స్‌కు కొదవేలేదని చెప్పాలి. ఇలా పోస్ట్‌ పెట్టారో లేదో అలా క్షణాల్లో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా యాంకర్‌ వర్షిణి చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ఒకటి సరికొత్త చర్చకు దారి తీసింది. కో యాంకర్‌ ‘జబర్దస్త్‌’ ఫేమ్‌ ఆది పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన పార్టీలో పాల్గొన్న వర్షిణి పార్టీకి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసింది. అయితే ఈ వీడియోకు జోడించిన క్యాప్షనే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

ఇంతకీ వర్షిణి ఏమని రాసిందనేగా… ఆదితో కేక్‌ కటించిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘పుట్టిన రోజు వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. డియర్‌ ఆది నీకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎప్పటికీ నా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఎంతగానో ఇష్టమైన వ్యక్తి, నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచే స్నేహితుడు’ అంటూ క్యాప్షన్‌ జోడించింది. అయితే చివర్లో రాసిన.. ‘రైటర్‌ ఆది నువ్వు నాకు రైట్‌రా ఆది’ వ్యాఖ్య నెట్టింట వైరల్‌ అవ్వడానికి కారణంగా మారింది. అయితే వర్షిణి పోస్ట్‌ ఆదిని బెస్ట్‌ ఫ్రెండ్‌గా భావిస్తూ చేసినట్లే కనిపిస్తోన్నా కొందరు నెటిజన్లు మాత్రం.. ‘సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వార్త కేవలం కామెంట్లకు మాత్రమే పరిమితం అవుతుందా.. లేక వర్షిణి, ఆది దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వస్తుందా చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..