బుల్లితెరపై ప్రస్తుతం ఉన్నటాప్ యాంకర్లలో శ్యామల (Anchor Shyamala) ఒకరు. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా.. వెండితెరపై కూడా స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది శ్యామల. మూవీస్… షోస్ అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే శ్యామల.. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‍గా ఉంటుంది. ఓవైపు యూట్యూబ్‌లో ఛానల్ నిర్వహిస్తూనే.. మరోవైపు ఇన్‌స్టాలో ఫాలోవర్లను అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టాలో తన ఫాలోవర్లతో లైవ్ చాట్ నిర్వహించింది శ్యామల.. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానాలు చెప్పింది. ఇక లైవ్‌చాట్‌లో యాంకర్ శ్యామలను నెటిజన్లు పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా.. ఓ నెటిజన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పమని అడిగాడు.. అందుకు శ్యామల తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది.
ఇక నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. నో కామెంట్స్.. కానీ ఆయన గొప్ప దర్శకుడు.. ఒకప్పుడు ఆయన చిత్రాలకు పెద్ద అభిమానిని అంటూ రిప్లై ఇచ్చింది. శ్యామల ఇచ్చిన ఆన్సర్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవల ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్మ యాంకర్ శ్యామలపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నారు అంటూ శ్యామలపై కామెంట్స్ చేశాడు వర్మ. దీంతో శ్యామలతోపాటు.. అక్కడున్నవారంత ఒక్కసారిగా షాకయ్యారు. వర్మ చేసిన కామెంట్స్.. గతంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
Also Read: Keerthy Suresh: బుట్టబొమ్మ పూజ హబిబో పాటకు మహానటి ఫిదా.. కీర్తిసురేశ్ డ్యాన్స్ వీడియో వైరల్
Prabhas: పాన్ ఇండియా హీరో ప్రభాస్.. ఆ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారా.?
Krithi Shetty: లక్కీ ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ.. మరో యంగ్ హీరోతో నటించే అవకాశం.?
Sharwanand: ఎట్టకేలకు హిట్ కొట్టిన కుర్ర హీరో.. ఆడాళ్లూ మీకు జోహార్లుతో ఆకట్టుకున్న శర్వా..