బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. ఇప్పటివరకు అన్ని భాషల్లోనూ ఈషోకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు విజయవంతగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏడవ సీజన్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఇక మరికొన్ని నెలల్లో ‘బిగ్‌బాస్’ ఓటీటీ సీజన్ 2 స్టార్ట్ కాబోతుందని ప్రచారం నడుస్తుంది. మార్చిలో ఓటీటీ సీజన్ 2 రాబోతుందని.. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతుందని అంటున్నారు. సీజన్ 7లో పాల్గోన్న ఒకరిద్దరూ మరోసారి ఓటీటీలోను ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే.. అటు తమిళం, కన్నడలోనూ ‘బిగ్‌బాస్‘ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. మరోవైపు హిందీలో ‘బిగ్‌బాస్’ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.. ఇప్పటివరకు మొత్తం 16 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది.
ఇప్పుడు 17 సీజన్ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘బిగ్‌బాస్’ సీజన్ 17కు హోస్టింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం హిందీలో ఈషో రసవత్తరంగా సాగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో కంటెస్టెంట్స్ ఫిజికల్ అటాక్‌కు పాల్పడుతున్నారు. ఇటీవలే కంటెస్టెంట్ అభిషక్, మరో కంటెస్టెంట్ సమర్థ్ జురెల్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన అభిషేక్ తోటి కంటెస్టెంట్ సమర్థపై చేయి చేసుకున్నాడు. దీంతో అతడిని హౌస్ నుంచి నేరుగా ఎలిమినేట్ చేసింది కెప్టెన్ అంకితా లోఖండే.
దీంతో ‘బిగ్‌బాస్’ తీరుపై అభిషేక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ తప్పులేదని.. సమర్థ్ కావాలని అతడిని రెచ్చగొట్టాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ గొడవపై ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తుండగా.. ఈరోజు సల్మాన్ ఖాన్ తోపాటు స్టేజ్ పై మరో హోస్ట్ కనిపించనున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు ఈసారి ‘బిగ్‌బాస్’ సీజన్17కి సల్మాన్ తోపాటు హోస్టింగ్ చేయబోతుందట.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న అభిషేక్, సమర్థ్ గొడవపై సల్మాన్, టబు కలిసి నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. టబు రాకతో ఇప్పుడు ‘బిగ్‌బాస్’ వీకెండ్ ఎపిసోడ్ పై మరింత క్యూరియాసిటి నెలకొంది. వీకెండ్ క వార్’ ఎపిసోడ్ సమయంలో టబు అతిథిగా వచ్చి ఇంటిసభ్యులతో అభిషేక్, సమర్థ్ గొడవపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈవారం టబు ఒక ఇంటి సభ్యుడిని ఎలిమినేట్ చేయనున్నట్లు టాక్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.