Madhuri Dixit-Kili Paul: బుల్లితెరపై సోషల్ మీడియా సెన్సెషన్ కిలీపాల్.. మాధురీ దీక్షిత్‏తో డాన్స్ అదరగొట్టాడుగా.. నెట్టింట వీడియో వైరల్..

|

Oct 08, 2022 | 7:48 AM

తన డాన్స్ స్టెప్పులతో సెలబ్రెటీ అయిన కిలీపాల్ ఇప్పుడు ఇండియాకు వచ్చేశాడు. అంతేకాకుండా బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‏తో కలిసి డాన్స్ అదరగొట్టాడు. అలాగే ఆమె కోసం ఏకంగా రతన్ లంబియాన్ సాంగ్ ఆలపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Madhuri Dixit-Kili Paul: బుల్లితెరపై సోషల్ మీడియా సెన్సెషన్ కిలీపాల్.. మాధురీ దీక్షిత్‏తో డాన్స్ అదరగొట్టాడుగా.. నెట్టింట వీడియో వైరల్..
Madhuri Dixit, Kilipaul
Follow us on

ప్రపంచంలో ఉన్న మట్టిలో మాణిక్యాలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయమవుతున్నారు. అలాంటి వారిలో కిలీపాల్ ఒకరు. ఆఫ్రికాలోని టాంజానియాకు చెందిన కిలీపాల్ గురించి చెప్పక్కర్లేదు. స్వతహాగా డాన్సర్ అయిన కిలీపాల్.. కంటెంట్ క్రియేటర్‏గా నెట్టింట దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా అతడు భారతీయ సినిమాల్లోని డైలాగ్స్.. పాటలకు డాన్స్ చేస్తూ తెగ ఫేమస్ అయ్యాడు. కేవలం కిలీపాల్ మాత్రమే కాకుండా.. అతని చెల్లెలు నీమా పాల్ సైతం తన అన్నయ్యతో కలిసి డాన్స్ చేస్తుంది. వీరికి ఇన్‏స్టాలో ఫాలోవర్లు అధికంగా ఉన్నారు. తన డాన్స్ స్టెప్పులతో సెలబ్రెటీ అయిన కిలీపాల్ ఇప్పుడు ఇండియాకు వచ్చేశాడు. అంతేకాకుండా బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‏తో కలిసి డాన్స్ అదరగొట్టాడు. అలాగే ఆమె కోసం ఏకంగా రతన్ లంబియాన్ సాంగ్ ఆలపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

హిందీలోని ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతున్న డాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జా 10లో కిలీపాల్ సందడి చేశాడు. అతడితో కలిసి తనకు డాన్స్ చేయాలని ఉందని చెప్పింది జడ్జీగా వ్యవహరిస్తున్న మాధూరీ దీక్షిత్. అనంతరం వేదికపైకి వచ్చిన మాధురీ.. ఫేమస్ సాంగ్ చన్నె కే ఖేత్ మే పాటకు డాన్స్ చేశారు. అలాగే.. మాధురీ దీక్షిత్ కోసం రతన్ లంబియాన్ సాంగ్ ఆలపించి ఆకట్టుకున్నాడు కిలీపాల్. ఇందుకు సంబంధించిన వీడియోను కలర్స్ ఛానెల తన ఇన్ స్టా వేదికగా షేర్ చేయగా.. కిలీపాల్ స్పందించారు. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అతడిని చూసి గర్వపడుతున్నాము. ఈ వ్యక్తి భారతదేశాన్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభమైన ఝలక్ దిఖ్లా జా డాన్స్ రియాలిటీ షోకు మంచి స్పందన వస్తోంది. ఇందులో మాధురీ దీక్షిత్, నోరా ఫతేహి, కరణ్ జోహర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 8 గంటలకు కలర్స్ టీవీలో ప్రసారమవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.