Nagineedu: మర్యాద రామన్న సినిమా నాకు మైనస్ అయ్యింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన నాగినీడు..

|

Nov 11, 2021 | 9:07 AM

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎంతో మంది టాలెంటెడ్ నటీనటులు ఉన్నారు. అయితే తమకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చిన ప్రతి ఒక్కరికి

Nagineedu: మర్యాద రామన్న సినిమా నాకు మైనస్ అయ్యింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన నాగినీడు..
Nagineedu
Follow us on

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎంతో మంది టాలెంటెడ్ నటీనటులు ఉన్నారు. అయితే తమకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశాలు మాత్రం రావు. ఇక కొందరు దర్శకులు.. హీరోహీరోయిన్లతోపాటు.. మిగతా నటీనటుల పాత్రలకు సైతం ఫుల్ క్రేజ్ తీసుకువస్తారు. అలాంటి వారిలో దర్శకధీరుడు రాజమౌళి ఒకరు. ఆయనతో సినిమాలు చేస్తే.. ప్లస్ .. మైనస్ రెండూ ఉంటాయి. ఆయన సినిమాల్లోని పాత్రలను మరింతే హై పీక్స్‏లో ప్రేక్షకుల ముందు నిలబెడతాడు. సినిమాల్లోని పాత్రలు.. వారి నిజజీవితమేనా అనే విధంగా తెరకెక్కిస్తాడు. ఇక రాజమౌళి సినిమా తర్వాత మరోసారి అదే రేంజ్ పాత్ర దక్కాలంటే చాలా కష్టం. దీంతో వారికి సరైన అవకాశాలు రావు. తాజాగా ఈ విషయాన్ని మరోసారి బయటపెట్టాడు నటుడు నాగినీడు..

సునీల్ ప్రధాన పాత్రలో రాజమౌళి తెరకెక్కించిన సినిమా మర్యాద రామన్న.. ఇందులో విలన్ పాత్రలో అదరగొట్టిన నాగినీడు.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో నాగినీడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కానీ ఈ సినిమ తర్వాత నాగినీడు ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. అలాంటి పాత్ర తిరిగి తనకు రాలేదు. దీంతో చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. ఇదిలా ఉంటే.. తాజాగా నాగినీడు.. అలీతో సరదాగా టాక్ షోకు అతిథిగా విచ్చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇందులో నాగినీడు మాట్లాడుతూ.. మర్యాద రామన్న సినిమా నన్ను ఓ స్థాయిలో నిలబెట్టింది. కానీ అదే నాకు మైనస్ అయ్యింది. అవకాశం కోసం ఏ దర్శకుడినైనా సంప్రదిస్తే.. నాగినీడు గారు.. మీరు మాత్రమే న్యాయం చేయగలరు అనే పాత్ర ఉంటే మీకు ఇస్తాం.. మా సినిమాలో అలాంటి క్యారెక్టర్ లేదు.. మిమ్నల్ని సాధారణ పాత్రల్లో ఊహించుకోలేం కదా అనేవారు. ఇవన్నీ ఎందుకు డబ్బొస్తే చాలు నాకు అనుకునేవాడిని అంటూ చెప్పుకొచ్చారు. అలాగే.. తనపై ఓ దర్శకుడు సీరియస్ అయినట్లుగా కూడా చెప్పారు. మరీ అతనెవరో తెలియాలంటే.. షో ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాలి.

Also Read: Hyper Aadi: తనపై దాడి చేశారనే వార్తలపై స్పందించిన హైపర్ ఆది.. వారికి స్వయంగా డబ్బులిస్తానంటూ..

Thaman: పుష్ప పాటలపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్.. ఏం చెప్పారంటే..