Tamil TV actress VJ Chithra: కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తమిళ సీరియల్ నటి, విజే చిత్ర(28) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదయం చెన్నై శివారు నష్రత్ పేట్టైలోని ప్రైవేట్ హోటల్‌లో ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల చిత్రకు చెన్నైకు చెందిన వ్యాపారవేత్త హేమంత్‌తో నిశ్చితార్ధం జరిగింది.
మరోవైపు చిత్ర ఆత్మహత్య సమయంలో హేమంత్ హోటల్‌లోనే ఉన్నాడు. తనను బయటికి పంపించి చిత్ర ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పాడు. దీనితో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పూనమల్లె పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, చిత్ర నటించిన ‘పాండియన్ స్టోర్స్’ అనే టీవీ సిరీస్ విశేష ప్రేక్షాదరణ పొందింది. అలాగే ఈమె పలు సినిమాల్లోనూ నటించి అభిమానులను మెప్పించింది.
Tamil serial actress chitra(28) died by suicide. The actress was famous for her role mullai in #vijaytv serial #PandianStores #RIP pic.twitter.com/MPR07o9mBk
— Yuvaraj (@Yuvaraj02034299) December 9, 2020