తెలుగులోకి హీరోగా అరంగేట్రం చేయనున్న స్టార్ కమెడియన్.. ఫుల్ కామెడీ ఎంటర్‏టైనర్‏తో రాబోతున్న హాస్యనటుడు..

|

Jan 23, 2021 | 2:57 PM

తమిళ ఇండస్ట్రీలో తన కమెడీతో టైమింగ్‏తో టాప్ కమెడియన్‏గా దూసుకుపోతున్నాడు సంతానం. ఇటీవలే హీరోగా మారి తన లక్‏ను పరీక్షించుకుంటున్నాడు ఈ నటుడు. ఇప్పటివరకు హీరోగా

తెలుగులోకి హీరోగా అరంగేట్రం చేయనున్న స్టార్ కమెడియన్.. ఫుల్ కామెడీ ఎంటర్‏టైనర్‏తో రాబోతున్న హాస్యనటుడు..
Follow us on

తమిళ ఇండస్ట్రీలో తన కమెడీతో టైమింగ్‏తో టాప్ కమెడియన్‏గా దూసుకుపోతున్నాడు సంతానం. ఇటీవలే హీరోగా మారి తన లక్‏ను పరీక్షించుకుంటున్నాడు ఈ నటుడు. ఇప్పటివరకు హీరోగా తమిళంలో వరుస ఆఫర్లను అందుకుంటూ తెగ బిజీగా ఉన్నాడు సంతానం. అటు తమిళంలోనే కాకుండా.. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తెలుగులో డబ్బింగ్ అయిన రాజారాణి, ఓకేఓకే లాంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలోకి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజాగా ఈ స్టార్ కమెడియన్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఎలాగంటే తాను నటించిన ‘సభాపతి’ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేయాని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఫుల్ కమెడీ ఎంటర్ టైనర్‏గా తెరకెక్కుతున్న సభాపతి సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంతో పుగల్ హీరోయిన్‏గా పరిచయం కానుంది. ఈ సినిమాకు శ్రీనివాసన్ దర్శకత్వం వహిస్తుండగా.. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరీ తెలుగులో కూడా సంతానం హీరోగా హిట్ సాధిస్తాడా ? లేదా ? అనేది.

Also Read:

Prabhas Salaar movie : ప్రభాస్ కోసం హీరోయిన్ ను వెతికే పనిలో దర్శకుడు ప్రశాంత్ నీల్..

Actor Sunil : రైతు సమస్యలపై సునీల్ కొత్త చిత్రం.. కీలక పాత్రల్లో కనిపించనున్న శ్రీకాంత్, తారక రత్న..