Movie Actress: నమ్మించి మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించిన సినీ నటి.. సంచలనంగా మారిన వివాదం..

|

Apr 16, 2021 | 1:37 PM

Movie Actress: కోలీవుడ్‌కి చెందిన వర్ధమాన నటి రాధ పోలీసులను ఆశ్రయించారు. ఓ పోలీసు అధికారి తనను నమ్మించి మోసం చేశాడంటూ..

Movie Actress: నమ్మించి మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించిన సినీ నటి.. సంచలనంగా మారిన వివాదం..
Actress Radha
Follow us on

Movie Actress: కోలీవుడ్‌కి చెందిన వర్ధమాన నటి రాధ పోలీసులను ఆశ్రయించారు. ఓ పోలీసు అధికారి తనను నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు చేశారు. సదరు పోలీసు అధికారిపై చీటింగ్ కేసు పెట్టింది. దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే.. సుందరం ట్రావెల్స్ సినిమాతో హీరోయిన్‌గా కోలీవుడ్‌ పరిచయమైంది నటి రాధ. గతంలో పెళ్లి అవగా.. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని వేరుగా జీవిస్తోంది. ఈ క్రమంలోనే సబ్ ఇన్‌స్పెక్టర్ వసంత్ రాజ్‌తో రాధకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధంగా మారింది. పైళ్లై విడాకులు తీసుకున్న రాధ.. అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న వసంతరాజ్‌కు దగ్గరైంది. రాధ కోసం ఎస్ఐ వసంతరాజ్ తిరువాన్మీయూరు నుంచి పడపళని పోలీస్ స్టేషన్‌కు పోస్టింగ్ మార్పించుకున్నాడు. రాధ కారణంగా వసంత రాజ్.. తన భార్య, పిల్లలను కూడా పట్టించుకోవడం మానేశాడు. దాంతో వసంత రాజ్ భార్య అతనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఆ కేసు పోలీస్ స్టేషన్‌లో అలాగే ఉంది.

అయితే, వసంత రాజు, రాధ మధ్య సాన్నిహిత్యం మరింత బలంగా మారింది. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య పెరిగిన అనుబంధంతో వసంత రాజ్ పేరును తనకు భర్తగా, తన పిల్లలకు తండ్రిగా ఆధార్ కార్డ్‌లో నమోదు చేయించింది రాధ. ఈ విషయం చివరికి వసంత రాజ్‌కు తెలిసింది. దాంతో రాధను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు వసంత రాజ్. ఈ క్రమంలో తన పోస్టింగ్‌ను కూడా ఆమెకు దూరంగా ఉండేలా ఎన్నూరుకు మార్పించుకున్నాడు. అయితే, రోజు రోజుకు వసంత రాజ్‌లో మార్పు కనిపిస్తుండటంతో రాధ అతనిని నిలదీసింది. అతను కావాలనే దూరం పెడుతున్నాడని గ్రహించిన రాధ.. చివరికి పోలీస్ స్టేషన్‌లో వసంత రాజ్‌పై ఫిర్యాదు చేసింది. వసంత రాజ్‌కు తనకు వివాహం జరిగిందని, నమ్మించి మోసం చేశాడని రాధ ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది.

Also read:

IPL 2021 : స్ట్రైక్‌ రేట్‌లో మనీశ్ పాండే చాలా బెటర్..! అతడితో పోలిస్తే ఢిల్లీ, చెన్నై ఆటగాళ్లు చాలా తక్కువ..

Actor Vivek: ప్రముఖ నటుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక.. ఐసీయూలో చికిత్స.. పరిస్థితి విషమం..