
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వర్సటైల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘RC 17’. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. కొన్నాళ్లుగా ఈ సినిమా గురించి ఏదోక న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రీసెంట్ తమిళ సెన్సేషనల్ హీరో రిషికాంత్ ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో మెరవడంతో సినీ వర్గాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. తమిళంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్న రిషికాంత్, ఇటీవల వచ్చిన ‘మొద రాత్రి’ , ‘డొరొతీ’ సినిమాలతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రిషికాంత్, 2015 నుంచే తమిళ పరిశ్రమలో నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా , నెగెటివ్ పాత్రల్లో మెప్పించారు. తెలుగులో కూడా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాలో ఒక గెస్ట్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
హైదరాబాద్‌లో జరిగిన ‘RC 17’ అధికారిక పూజా కార్యక్రమానికి రిషికాంత్ ప్రత్యేకంగా హాజరుకావడంతో, సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ డ్రామాలో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ సరసన లేదా ఒక పవర్‌ఫుల్ రోల్‌లో రిషికాంత్ కనిపించనున్నారనే ప్రచారం జోరందుకుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
అయితే మరికొందరు ఫిలిం నగర్ వర్గాలు మాత్రం ఈ రూమర్స్‌ను భిన్నంగా కనిపిస్తున్నాయి. ‘RC 17’ నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రిషికాంత్ హీరోగా ఓ తమిళ సినిమా తెరకెక్కుతోందని, ఆ షూటింగ్ కూడా ఇక్కడే జరుగుతుండటంతో ఆయన మర్యాదపూర్వకంగా ఈ లాంచ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చారని చెప్తున్నారు. ఏది ఏమైనా, రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో ఈ తమిళ యంగ్ హీరో నిజంగానే నటిస్తున్నారా? లేదా కేవలం అథిథిగా మాత్రమే వచ్చారా అనేది చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప స్పష్టత రానట్లే..
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..