తమిళ స్టార్ హీరోకు తెలుగు ఇండస్ట్రీలో సూపర్ ఆఫర్.. భారీ బడ్జెట్‏తో ఆ సినిమా టాలీవుడ్‏లోకీ ?..

|

Dec 28, 2020 | 9:13 AM

తమిళ స్టార్ హీరో అజిత్‏కు తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా ఎక్కువగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో అజిత్ సినిమాలు తెలుగులో విడుదల

తమిళ స్టార్ హీరోకు తెలుగు ఇండస్ట్రీలో సూపర్ ఆఫర్.. భారీ బడ్జెట్‏తో ఆ సినిమా టాలీవుడ్‏లోకీ ?..
Follow us on

తమిళ స్టార్ హీరో అజిత్‏కు తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా ఎక్కువగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో అజిత్ సినిమాలు తెలుగులో విడుదల అయ్యి మంచి విజయాలను సాధించాయి కూడా. అయితే ఈ తమిళ స్టార్ హీరో ‘వాలిమై’ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలో ఎక్కువ శాతం షూటింగ్ హైదరాబాద్‏లోనే చేశారు. కాగా అజిత్ నటిస్తున్న వాలిమై సినిమా అటు తమిళ ప్రేక్షుకలతోపాటు, తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం అజిత్ నటిస్తున్న వాలిమై చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసేందుకు ప్రముఖ నిర్మాతలు పోటీ పడ్డట్లుగా తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ్ ఈ సినిమా డబ్బింగ్ రైట్స్‏ను ఏకంగా రూ.10 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం వినిపిస్తోంది. కాగా ఈ సినిమాకు తెలుగులో కూడా అదే టైటిల్ ఉంటుందా ? లేక వేరే ఏమైనా టైటిల్ పెడతారా ? అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. వాలిమై సినిమాను బోణీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇందులో విలన్‏గా టాలీవుడ్ నటుడు కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకొని ఎంతవరకు వసూళ్ళు చేస్తుందనేది అందిరిలో ఉన్న సందేహం..