Sye Raa: అంచనాలు పెంచేసిన మేకింగ్ వీడియో

| Edited By:

Aug 14, 2019 | 3:59 PM

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా సైరా మేకింగ్ వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. 1.47నిమిషాల పాటు సాగిన ఈ మేకింగ్ వీడియోలో మూవీ కోసం […]

Sye Raa: అంచనాలు పెంచేసిన మేకింగ్ వీడియో
Follow us on

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా సైరా మేకింగ్ వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. 1.47నిమిషాల పాటు సాగిన ఈ మేకింగ్ వీడియోలో మూవీ కోసం ఉపయోగించిన దుస్తులు, వారు ఉపయోగించిన కత్తులు, ప్రధాన తారాగణం గెటప్‌లె మొత్తాన్ని చూపించారు. మొత్తానికి మేకింగ్ వీడియోతో మరోసారి అంచనాలను పెంచేసింది చిత్ర యూనిట్. అలాగే సైరా టీజర్ ఈ నెల 20న రానుందని కూడా వెల్లడించారు ఈ మూవీ హిందీ రైట్స్ సొంతం చేసుకున్న నటుడు ఫర్హాన్ అక్తర్.

కాగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రానున్న ఈ మూవీలో మెగాస్టార్ సరసన నయనతార నటించగా.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, రవి కిషన్,  తమన్నా,నిహారిక తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.