AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దయచేసి నా కొడుకు గురించి చెప్పండి: రియాకు సుశాంత్ తండ్రి మెసేజ్‌

తన కొడుకు గురించి తనకు తెలియాలంటూ గతేడాది నవంబర్‌లో సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌, నటి రియాకు మెసేజ్‌ పెట్టారు. దీనికి సంబంధించిన ఓ స్క్రీన్ షాట్‌ ప్రస్తుతం

దయచేసి నా కొడుకు గురించి చెప్పండి: రియాకు సుశాంత్ తండ్రి మెసేజ్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 11, 2020 | 3:19 PM

Share

Sushant father message to Rhea: తన కొడుకు గురించి తనకు తెలియాలంటూ గతేడాది నవంబర్‌లో సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌, నటి రియాకు మెసేజ్‌ పెట్టారు. దీనికి సంబంధించిన ఓ స్క్రీన్ షాట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రియాకు మాత్రమే కాదు అతడి మాజీ మేనేజర్ శ్రుతీ మోదీలకు సైతం కేకే సింగ్‌ మెసేజ్ చేశారు.

రియాకు పెట్టిన మెసేజ్‌లో నేను సుశాంత్‌ తండ్రిని అని తెలిసినప్పుడు నాతో ఎందుకు మాట్లాడటం లేదు..? అసలు ఏం జరుగుతోంది..? స్నేహితురాలిగా నువ్వు సుశాంత్‌ని చూసుకుంటున్నప్పుడు, అతడి గురించి తెలుసుకోవల్సిన బాధ్యత తండ్రిగా నాకు ఉంది. దయచేసి నాకు ఫోన్ చేసి వివరాలు చెప్పండి అని ఉంది. అయితే ఆ మెసేజ్‌కి రియా రిప్లై ఇవ్వలేదు.

ఇక శృతీకి పెట్టిన మెసేజ్‌లో.. ”సుశాంత్‌ లోన్‌ల గురించి నువ్వే చూసుకుంటున్నావని నాకు తెలుసు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియాలి. నిన్న సుశాంత్‌తో మాట్లాడినప్పుడు అతడు అప్‌సెట్‌లో ఉన్నట్లు చెప్పాడు. అలా అన్నప్పుడు ఒక తండ్రి ఎంతలా బాధపడతాడో నీకు తెలుసు. అందుకే నీతో మాట్లాడాలనుకుంటున్నా. ఒకవేళ నువ్వు మాట్లాడకపోతే, నేను ముంబయికి వస్తా. ఫ్లైట్‌ టికెట్‌ని పంపించండి” అని ఉంది. ఇదిలా ఉంటే ఇవాళ ఈడీ అధికారుల ముందుకు శృతీ హాజరైంది. ఈ సందర్భంగా రియాపై ఆమె పలు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుశాంత్‌ విషయాలన్నీ రియానే చూసుకునేది అని శృతీ, ఈడీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.

Read This Story Also: మౌత్‌వాష్‌లతో పుక్కలిస్తే తగ్గుతున్న కరోనా వైరస్‌

Follow Us
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే
ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే
పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలు ఇవే.. నవరాత్రుల్లో దర్శిస్తే ప్రత్
దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలు ఇవే.. నవరాత్రుల్లో దర్శిస్తే ప్రత్