Sushant Case Updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ కేసును సీబీఐ, ఈడీ, ఎన్సీబీ అధికారులు దర్యాప్తు చేస్తుండగా.. ఇంతవరకు ఏ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎయిమ్స్ అధికారులు తెలిపారు. అయితే సుశాంత్ కుటుంబం మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. సుశాంత్‌ని ఎవరో హత్య చేశారని, ఎయిమ్స్ అధికారులు యూటర్న్ తీసుకున్నారని వారు అంటున్నారు. ఇక సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్టైన రియా ఇటీవల బెయిల్‌పై విడుదలై బయటకు రాగా.. ఈ కేసు దర్యాప్తులో కూడా వేగం తగ్గింది.
ఇలాంటి నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ మరణంపై స్పందించారు. ముందు నుంచి సుశాంత్‌ని హత్య చేశారంటూ చెబుతూ వస్తోన్న స్వామి.. ఈ సారి మరిన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. సుశాంత్ చనిపోయే ముందు తాగిన ఆరెంజ్ జ్యూస్ గ్లాస్‌ని ఎందుకు భద్రపర్చలేదు.? ఎవరైనా అనుమానాస్పదంగా మరణిస్తే వారి ఇళ్లను కచ్చితంగా సీల్ చేయాలి. కానీ ముంబయి పోలీసులు మాత్రం సుశాంత్ ఇంటిని ఎందుకు సీల్ చేయలేదు అని ఆయన ప్రశ్నించారు.
Read More: