AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్య ‘ఎన్జీకే’ రివ్యూ

నటీనటులు: సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్‌సింగ్, దేవరాజు, రాజ్‌కుమార్, పొన్నవనం తదితరులు దర్శకత్వం: సెల్వ రాఘవన్ నిర్మాతలు: ఎస్‌ ఆర్ ప్రభు(తమిళ్), కేకే రాధా మోహన్(తెలుగు) సంగీతం: యువన్ శంకర్ రాజా జోనర్: పొలిటికల్ థ్రిల్లర్ విభిన్న కథలను ఎంచుకోవడంలో కోలీవుడ్ నటుడు సూర్య ఎప్పుడూ ముందుంటారు. మరోవైపు వైవిధ్య దర్శకుడిగా సెల్వరాఘవన్‌కు మంచి పేరుంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ అంటే అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు టీజర్, ట్రైలర్‌ కూడా ఆకట్టుకోవడంతో […]

సూర్య ‘ఎన్జీకే’ రివ్యూ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 31, 2019 | 1:09 PM

Share

నటీనటులు: సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్‌సింగ్, దేవరాజు, రాజ్‌కుమార్, పొన్నవనం తదితరులు దర్శకత్వం: సెల్వ రాఘవన్ నిర్మాతలు: ఎస్‌ ఆర్ ప్రభు(తమిళ్), కేకే రాధా మోహన్(తెలుగు) సంగీతం: యువన్ శంకర్ రాజా జోనర్: పొలిటికల్ థ్రిల్లర్

విభిన్న కథలను ఎంచుకోవడంలో కోలీవుడ్ నటుడు సూర్య ఎప్పుడూ ముందుంటారు. మరోవైపు వైవిధ్య దర్శకుడిగా సెల్వరాఘవన్‌కు మంచి పేరుంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ అంటే అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు టీజర్, ట్రైలర్‌ కూడా ఆకట్టుకోవడంతో కేజీఎఫ్‌ కోసం ఇటు టాలీవుడ్, అటు టాలీవుడ్‌లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో ఇవాళ విడుదలైన ఎన్జీకే ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ: ఒక ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేసే నంద గోపాల కృష్ణ ఆ ఉద్యోగాన్ని వదిలి రైతుగా పనిచేస్తుంటాడు. కుటుంబంతో సంతోషంగా ఉండే నంద గోపాల్ ఆయన స్నేహితులు క్రిమి సంహారిణి మాఫియా నుంచి కొన్నిఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొన్ని కీలక పరిణామాల వల్ల అతడు రాజకీయాల్లోకి వెళ్తాడు. ఒక సాధారణ కార్యకర్త నుంచి మొదలయ్యే సూర్య కెరీర్ రాజకీయాల్లో అంచెలంచెలుగా పెరుగుతుంది. అయితే ఆయనను అడ్డుకునేందుకు రాజకీయాల్లో ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి దుష్ట రాజకీయ నాయకులను ఆయన ఎలా ఎదుర్కొన్నాడు..? అందరి మెప్పును పెందే నాయకుడిగా నంద గోపాల కృష్ణ ఎలా ఎదిగాడు అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ: ప్రేమ కథలను ఎక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన సెల్వ రాఘవన్ సూర్య కోసం పొలిటికల్ కథను రాసుకున్నారు. అయితే ఈ సినిమాను తెరకెక్కించడంలో ఆయన విఫలమయ్యారు. కథ పాతదే అయినప్పటికీ కథనంలో మార్పులు చేసి ఇప్పటి దర్శకులు హిట్‌లు కొడుతుండగా.. సెల్వ రాఘవన్ మాత్రం అందులో కూడా ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయాడు. అందునా కొన్ని సన్నివేశాల్లో కొత్తదనం కూడా కనిపించదు. ట్విస్ట్‌లు పెద్దగా లేకపోవడంతో పాటు ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి సింక్ లేకుండా సినిమాను తెరకెక్కించాడు సెల్వ రాఘవన్. ఇక యువన్ సంగీతం సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచింది. అయితే కెమెరా వర్క్ ఓకే అనిపించినా.. ఎడిటింగ్ విభాగం పనితీరు మాత్రం సినిమాకు మరో మైనస్‌గా నిలిచింది.

నటీనటులు : పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయే సూర్య ఈ చిత్రంలోనూ అద్భుతనటనను కనబరిచారు. భార్యగా సాయి పల్లవి, కార్పోరేట్ పీఆర్వోగా రకుల్ ఆకట్టుకున్నా.. వారి పాత్రలకు మాత్రం అంతంతమాత్రమే ప్రాధాన్యత ఉంది. ఇక మిగిలిన పాత్రలు కూడా గుర్తుపెట్టుకునేలా లేవు.

ప్లస్‌ పాయింట్స్: సూర్య, సాయి పల్లవి, రకుల్ నటన సంగీతం

మైనస్ పాయింట్స్: రొటీన్ కథ గ్రిప్ లేని స్క్రీన్‌ప్లే ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి సింక్ లేకపోవడం

ముగింపు: నంద గోపాల కృష్ణ.. సూర్య వన్‌మ్యాన్ షో..

Follow Us