సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. స్టార్ ప్రొడ్యూసర్ కన్నుమూత! చివరి దశలో మందులకు కూడా డబ్బు లేక దీనస్థితిలో..

గత కొంతకాలంగా సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో పలువురు సినీ ప్రముఖులు ఒకరి వెంట ఒకరు మరణించడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల హీరో విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన మరిచిపోకముందే తాజాగా మరో స్టార్‌ నిర్మాత కన్నుమూశారు. తమిళంలో సేతు, బాబా, శివపుత్రుడు, గజేంద్ర వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన నిర్మాత..

 సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. స్టార్ ప్రొడ్యూసర్ కన్నుమూత! చివరి దశలో మందులకు కూడా డబ్బు లేక దీనస్థితిలో..
Producer VA Durai

Updated on: Oct 03, 2023 | 5:04 PM

చెన్నై, అక్టోబర్‌ 3: గత కొంతకాలంగా సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో పలువురు సినీ ప్రముఖులు ఒకరి వెంట ఒకరు మరణించడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల హీరో విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన మరిచిపోకముందే తాజాగా మరో స్టార్‌ నిర్మాత కన్నుమూశారు. తమిళంలో సేతు, బాబా, శివపుత్రుడు, గజేంద్ర వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన నిర్మాత వీఏ దురై (69) సోమవారం రాత్రి (అక్టోబర్‌ 2) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని వలసరవాక్‌లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు.

ప్రొడ్యూసర్‌ వీఏ దురై మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. గజేంద్ర సినిమా తర్వాత వీఏ దురై సినిమాలకు దూరమయ్యారు. గత కొంతకాలంగా డయాబెటిస్‌తో బాధపడున్నారు. ఈ క్రమంలో ఆయనకు కొన్ని నెలల క్రితం కాలు తీసేయవల్సి వచ్చింది. శస్ర్త చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వేగంగా బరువు తగ్గిపోయి, బక్కచిక్కి గుర్తుపట్టలేనంతగా మరిపోయారు. మందుల ఖర్చులకు కూడా డబ్బులేక అవస్థపడ్డారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం తాను కష్టాల్లో ఉన్నానని, ఆర్ధికంగా ఆదుకోవాలని ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో హీరో సూర్యతోపాటు పలువురు తమిళ సినీ ప్రముఖులు సహాయం చేశారు కూడా. హీరో సూర్య రూ.2 లక్షలు, నిర్మాత కరుణాస్‌ రూ.50 వేలు, రజనీకాంత్ , రాఘవ లారెన్స్ , విక్రమ్ ఆర్ధికసాయం అందించారు. చివరిదశలో చికిత్సకు సరిపడా డబ్బులు లేక ఆయన మరణించారని సమాచారం.

స్టార్‌ ప్రొడ్యూజర్‌ వీఏ దురై కెరీర్‌లో ఎన్నో హిట్‌ సినిమాలను నిర్మించారు. నిర్మాతగా బాబా, పితామగన్, లవ్లీ, గజేంద్ర వంటి చిత్రాలను వీఏ దురై నిర్మించారు. ఇందులో విక్రమ్, సూర్య నటించిన ‘శివ పుత్రుడు’ సినిమా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ కొట్టింది. ఆయన చివరి సినిమా గజేంద్ర. ఈ సినిమా తర్వాత ఆయన చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.