సూర్య కొత్త చిత్రం ప్రారంభం

చెన్నై: ఒకవైపు ‘ఎన్జీకే’ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండగా..మరో వైపు కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేసేశాడు హీరో సూర్య. మాధవన్‌తో ‘ఇరుది సుట్రు’, వెంకటేష్‌తో ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన సుధ కొంగరా ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పూజ కార్యక్రమం చెన్నైలో జరిగింది. సీక్యా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సూర్యకు జోడీగా అపర్ణ బాలమురళీ నటిస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నికేత్‌ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పూజ కార్యక్రమంలో […]

సూర్య కొత్త చిత్రం ప్రారంభం

Edited By:

Updated on: Apr 08, 2019 | 7:10 PM

చెన్నై: ఒకవైపు ‘ఎన్జీకే’ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండగా..మరో వైపు కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేసేశాడు హీరో సూర్య. మాధవన్‌తో ‘ఇరుది సుట్రు’, వెంకటేష్‌తో ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన సుధ కొంగరా ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పూజ కార్యక్రమం చెన్నైలో జరిగింది. సీక్యా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సూర్యకు జోడీగా అపర్ణ బాలమురళీ నటిస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నికేత్‌ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పూజ కార్యక్రమంలో శివకుమార్‌, సూర్య, నటుడు కార్తి, అపర్ణ, సుధ, జీవీ ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ నేటి నుంచి ప్రారంభమైంది.