రజనీ ‘అన్నాత్తే’ ఆగిపోయిందా..!

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ప్రధానపాత్రలో 'సిరుతై' శివ తెరకెక్కిస్తోన్న చిత్రం 'అన్నాత్తే'. ఖుష్బూ, మీనా, నయనతార హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, సూరి, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

రజనీ అన్నాత్తే ఆగిపోయిందా..!

Edited By:

Updated on: Jul 28, 2020 | 9:06 AM

Rajinikanth Annaathe: సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ప్రధానపాత్రలో ‘సిరుతై’ శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘అన్నాత్తే’. ఖుష్బూ, మీనా, నయనతార హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, సూరి, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. లాక్‌డౌన్ విధించే సమయానికి ఈ మూవీ షూటింగ్ దాదాపు‌ 50 శాతం పూర్తి అయ్యింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూవీ షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న దానిపై క్లారిటీ లేదు. ఈ క్రమంలో ‘అన్నాత్తే’ ఆగిపోయినట్లు పుకార్లు మొదలయ్యాయి.

రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో వ్యాక్సిన్ వచ్చే వరకు సెట్స్ మీదకు వెళ్లకూడదని రజనీ భావిస్తున్నారట. ఈ క్రమంలో అన్నాత్తే ఆగిపోయిందని, రజనీ అడ్వాన్స్‌ను వెనక్కి ఇచ్చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మూవీ యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం అన్నాత్తే ఆగలేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్‌ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని షూటింగ్‌ను ఇంకా ప్రారంభించలేదని చెబుతోంది. కాగా సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు డి.ఇమ్మన్‌ సంగీతం అందించనున్నారు.

Read This Story Also: లంకా దినకర్‌కి షోకాజ్ నోటీస్‌