యంగ్ డైరక్టర్‌కు బంపరాఫర్.. మహేష్‌ నుంచి పిలుపు..!

| Edited By:

Mar 17, 2020 | 8:38 AM

సూపర్‌స్టార్ మహేష్ బాబు యంగ్ టాలెంట్‌పైనే ఆసక్తిని చూపుతున్నారు. ఓ వైపు ఆయనతో సినిమాలను తెరకెక్కించేందుకు స్టార్ దర్శకులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఆయన మాత్రం యంగ్ దర్శకులకే ఓటేస్తున్నారు

యంగ్ డైరక్టర్‌కు బంపరాఫర్.. మహేష్‌ నుంచి పిలుపు..!
Follow us on

సూపర్‌స్టార్ మహేష్ బాబు యంగ్ టాలెంట్‌పైనే ఆసక్తిని చూపుతున్నారు. ఓ వైపు ఆయనతో సినిమాలను తెరకెక్కించేందుకు స్టార్ దర్శకులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఆయన మాత్రం యంగ్ దర్శకులకే ఓటేస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’తో అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇచ్చిన మహేష్.. త్వరలో పరశురామ్‌ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం మరో యంగ్ డైరక్టర్‌కు మహేష్ నుంచి పిలుపు వచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

‘ఛలో’ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంకీ కుడుముల ఈ మధ్య ‘భీష్మ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో పాటు దర్శకుడిగా వెంకీకి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇటీవల ‘భీష్మ’ను చూసిన మహేష్‌కు ఆ మూవీ బాగా నచ్చిందట. ఈ క్రమంలో దర్శకుడికి ఫోన్ చేసి తన వద్దకు పిలిపించుకున్నారట మహేష్. అంతేకాదు తన కోసం ఏదైనా ఓ స్టోరీని రాసుకు రమ్మని వెంకీ కుడుమలకు సూచించారట. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్ కోసం కథను తయారుచేసే పనిలో వెంకీ కుడుముల పడ్డట్లు తెలుస్తోంది. ఒకవేళ అన్నీ కుదిరితే వెంకీ దర్శకత్వంలో మహేష్ నటించే అవకాశం ఉంది. కాగా మరోవైపు ఇప్పటికే చెర్రీ కోసం ఓ కథను రెడీ చేసుకున్న వెంకీ.. ఆయనకు వినిపించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రెండు సినిమాలతోనే వెంకీ టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారడం విశేషం.

Read This Story Also: డైలమాలో పవన్ టీమ్..!