పవర్ స్టార్ పైన ప్రశంసలు కురిపించిన సూపర్ స్టార్.. పవన్ టాప్ ఫామ్ లో ఉన్నారన్న మహేష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటించి ఆకట్టుకున్నారు.

పవర్ స్టార్ పైన ప్రశంసలు కురిపించిన సూపర్ స్టార్.. పవన్ టాప్ ఫామ్ లో ఉన్నారన్న మహేష్
Mahesh

Updated on: Apr 11, 2021 | 8:19 AM

Mahesh Babu And Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటించి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమ పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నివేద థామస్, అంజలీ, అనన్య నటించారు. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ తెరపై కనిపించడంతో అభిమానుల్లో ఆనందం అవధులు దాటింది. మొదటి షో నుంచి ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.

ఇక వకీల్ సాబ్ సినిమాతో మరోసార్ తన మార్క్ ను చూపించారు పవన్. పవర్ ఫుల్ యాక్టింగ్ తో అదిరిపోయే డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాపై సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా ఈ సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన తన స్టైల్ లో సినిమాపై రివ్యూ ఇచ్చారు. మూడేళ్లవుతున్న పవన్ లో అదే వేడి .. అదే వాడి.. అదే పవర్ అంటూ కితాబిచ్చారు మెగాస్టార్. మెగాస్టార్ తోపాటు చాలా మంది యంగ్ హీరోలు కూడా వకీల్ సాబ్ సినిమాను ఆకాశానికి ఎత్తేసారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వకీల్ సాబ్ సినిమాపై స్పందించారు. తాజాగా సినిమా చుసిన మహేష్ పవన్ కళ్యాణ్ పై చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ టాప్ ఫామ్ లో ఉన్నారన్న మహేష్.. వకీల్ సాబ్ సినిమాలో పవన్ పవర్ ప్యాక్ పర్ఫామెన్స్ చుపించారన్న మహేష్ ప్రకాష్ రాజ్ కూడా అద్భుతంగా నటించారన్నారు. ఇక పవర్ కు ఇది పర్ఫెక్ట్ కంబ్యాక్ అన్నారు మహేష్. అలాగే సినిమాలో నటించిన నివేదాథామస్, అంజలీ, అనన్య తోపాటు చిత్రయూనిట్ ను అభినందించారు మహేష్. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి : Chavu Kaburu Challaga: ఓటీటీలోకి మరో యంగ్ హీరో సినిమా.. ఆ తేదీన రానున్న ‘చావు కబురు చల్లగా’…

థియేటర్లో నిల్చున్న ‘వకీల్ సాబ్’ హీరోయిన్… కరోనా తగ్గిందా అంటున్న ఆడియన్స్.. ‘మాటల్లేవ్’ అంటున్న నివేధా..

Vakeel Saab Movie: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ‘వకీల్‌ సాబ్’కు షాక్.. కీలక తీర్పునిచ్చిన ధర్మాసనం..