Box Office War:మనిషి జీవితం కరోనాకు ముందు తర్వాత అన్నట్లుగానే సినీ పరిశ్రమలో కూడా సందడి కరోనా కు ముందు తరువాత అని చెప్పొచ్చు.. లాక్ డౌన్ నేపథ్యంలో సంక్రాంతి కి తెలుగు రాష్ట్రాల్లో సినీ థియేటర్స్ వెలవెలబోయాయి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది చిత్ర పరిశ్రమ. ఇక టాలీవుడ్ లో దాదాపు ఏడాది తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. క్రాక్ సినిమా ఇచ్చిన బూస్ట్ కు ఉప్పెన బాక్సాఫీస్ వద్ద చేసిన సందడి ఇవన్నీ జత కలిసి ఒక సినిమా తరవాత మరొకటి రిలీజ్ అవ్వడానికి పోటా పోటీగా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి..
వేసవి వినోదంగా పవన్ కళ్యణ్ తాజా సినిమా వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానున్నది ఏప్రిల్ 9 బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అయితే వకీల్ సాబ్ కంటే ఒక వారం ముందు ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ పోటీకి సిద్ధమయ్యారు, గోపిచంద్ సీటిమార్ ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతుండగా అదే రోజు కింగ్ నాగార్జున తాజా మూవీ వైల్డ్ డాగ్ కూడా రాబోతోంది. నాగ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. సినిమా చూస్తుంటే బజ్ క్రియేట్ చేసేలా ఉంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఏడురోజుల గ్యాప్ లో మూడు భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి, వకీల్ సాబ్ కంటే ముందు రిలీజ్ అవుతున్న సిటీమార్, వైల్డ్ డాగ్ లు వారం రోజుల్లో ప్రాఫిక్ కలెక్షన్లు రాబట్టాలి.. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత చేస్తోన్న సినిమా వకీల్ సాబ్.. హిట్ ప్లాప్ టాక్ లతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్ వసులు చేస్తుంది అన్నసంగతి అందరికీ తెలిసిందే.. ఇక వకీల్ సాబ్ కు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ రెండు సినిమాల కలెక్షన్ల పై ప్రభావం తప్పకుండా పడుతుందని సినీ క్రిటిక్స్ మాట.. సో వేసవి వినోదంగా పోటీ పడుతున్న ఈ మూడు సినిమాల్లో ఎవరు ప్రేక్షకులను అలరిస్తారో.. ఎవరు కలెక్షన్ల సునామీ సృష్టిస్తారో చూడాలి మరి
Also Read: