ఇంటి పని చేసిన లెక్కల మాస్టార్‌.. మార్కులేసిన సతీమణి..!

లాక్‌డౌన్‌ వేళ టాలీవుడ్‌లో 'బి ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రారంభమైన ఈ ఛాలెంజ్‌ను ఇప్పుడు పలువురు సినీ ప్రముఖులు పాటిస్తున్నారు.

ఇంటి పని చేసిన లెక్కల మాస్టార్‌.. మార్కులేసిన సతీమణి..!

Edited By:

Updated on: Apr 22, 2020 | 11:03 AM

లాక్‌డౌన్‌ వేళ టాలీవుడ్‌లో ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రారంభమైన ఈ ఛాలెంజ్‌ను ఇప్పుడు పలువురు సినీ ప్రముఖులు పాటిస్తున్నారు. ఇంట్లో పనులు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మరికొంతమందికి సవాల్‌ను విసురుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి ఇచ్చిన సవాల్‌ను స్వీకరించారు లెక్కలమాస్టార్‌, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్. దానికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో సుకుమార్ ఇంటి పనికి చివర్లో ఆయన సతీమణి తబిత బావుందంటూ మార్కులేయడం విశేషం. ఇక తన ఛాలెంజ్‌ను స్వీకరించాలంటూ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, శివ కొరటాల, నిర్మాత దిల్‌ రాజు పేర్లను నామినేట్ చేశారు సుకుమార్.

Read This Story Also: మెగాస్టార్‌పై ఫ్యాన్స్‌ అసంతృప్తి.. ఎందుకంటే..!