
దివంగత ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం (ఎస్‌పిబి) కుటుంబం తమ అనుమతి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) , డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ వాయిస్‌ని ఉపయోగించినందుకు తెలుగు మూవీ కీడా కోలా నిర్మాతలు, సంగీత దర్శకులపై చట్టపరమైన చర్య తీసుకుంది. ఈ మేరకు ఎస్పీబీ తనయుడు చరణ్ లీగల్ నోటీసు జారీ చేశారు. దివంగత గాయకుడి స్వరాన్ని సజీవంగా ఉంచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని తమ కుటుంబం సమర్ధిస్తున్నప్పటికీ, తమకు తెలియకుండా వినియోగించడం పట్ల వారు ఒకింత మండిపడ్డారు.
“దీనికి సరైన మార్గం ఉందని నేను నమ్ముతున్నాను” అని చరణ్ పేర్కొన్నాడు. “సాంకేతికత మానవాళికి ఉపయోగపడాలి. కానీ జీవనోపాధికి హాని కలిగించకూడదు. ఈ సందర్భంలో సింగర్స్ కుటుంబాలను సమాచారామివ్వాలి. గాయకుల వారసత్వాన్ని నిలబెట్టడానికి ఇది ఒక సానుకూల అవకాశంగా నేను భావించాను. కానీ అనుమతి లేకుండా వాడుకోవడం మాత్రం తప్పే’’ అంటూ చరణ్ రియాక్ట్ అయ్యారు.
రాయల్టీలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాను లీగల్ నోటీసు పంపినట్లు చరణ్ పేర్కొన్నాడు. పరస్పర ఆమోదయోగ్యమైన తీర్మానాన్ని కనుగొనడానికి నేరుగా చర్చకు వారిని ఆహ్వానించారు. “అయితే AI సాంకేతికత ద్వారా దివంగత బాలు వాయిస్‌ని ఉపయోగించడాన్ని అంగీకరిస్తున్నా. కానీ ఈ అంశంపై మీడియా ద్వారా విచారణ జరపాలని నిజాయితీగా సూచించా” అని చరణ్ వ్యాఖ్యానించారు. “మేం మీడియా ద్వారా ఈ సమస్యను తీవ్రతరం చేయాలనే ఉద్దేశ్యం లేదు, బదులుగా లీగల్ పరంగా చర్యలు తీసుకుంటాం” అని చెప్పాడు.
సాంకేతికతను ఉపయోగించి మరణించిన గాయకుల స్వరాలను ఉపయోగించుకోవచ్చు. ఇటీవల ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు A R రెహమాన్ సరైన అనుమతితో దివంగత
గాయకుల స్వరాలను వాడుకున్నారు. కానీ ఏఐ టెక్నాలజీతో సింగర్స్ భవిష్యత్తు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని గాయకుడు చరణ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. తన త్రండి తర్వాత ఎస్పీ చరణ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.