
సోషల్ మీడియా అందరి జీవితాల్లోనూ భాగమైపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీస్ తమ అభిమాలను నేరుగా పలకరించే మాద్యమంగా మారిపోయింది. అంతేకాదు, సోషల్ మీడియా సెలబ్రిటీస్ పాపులారిటీని కొలిచే స్కేల్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్.. వంటి పలు సోషల్ మీడియా వేదికలు స్టార్లను వారి అభిమానులకు చేరువ చేస్తున్నాయి.
అయితే వీటన్నింటిలోనూ ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ హవా ఎక్కువ. సౌత్ ఇండియన్ సినిమా (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) నుంచి 10 మిలియన్ (1 కోటి) ఫాలోవర్స్ దాటిన సెలబ్రిటీస్‌లో టాప్-10 మంది ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో రాణిస్తున్నారు. పుష్ప, RRR, బాహుబలి, అనిమల్ వంటి సినిమాలు సౌత్ఇండియన్ స్టార్స్ ఫాలోయింగ్‌ను భారీగా పెంచాయి. ఇన్స్టాలో ఫాలోవర్స్ సంఖ్య పది మిలియన్లు దాటిన స్టార్స్ ఎవరో చూద్దాం..
నేషనల్ క్రష్! పుష్పలో శ్రీవల్లి, అనిమల్, పుష్ప 2తో సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా క్వీన్. డ్యాన్స్ రీల్స్, క్యూట్ స్మైల్ ఫోటోలు, ట్రావెల్ పోస్టులతో యూత్‌ను ఫిదా చేస్తోంది. సౌత్ ఫీమేల్ స్టార్స్‌లో నంబర్-1!
స్టైలిష్ స్టార్ & సౌత్ మేల్ స్టార్స్‌లో టాపర్! పుష్ప 1,2 సక్సెస్, నేషనల్ అవార్డ్ తర్వాత ఫాలోయింగ్ రాకెట్ లాగా పెరిగింది. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి, కూతురు అర్హకి కూడా ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువే ఉన్నారు.
బోల్డ్ బ్యూటీ! డివోర్స్ తర్వాత కూడా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఫిట్‌నెస్ జర్నీ, సిటాడెల్ సీరీస్, మైయోసైటిస్‌తో ఫైట్ చేసిన స్టోరీలతో అభిమానులు స్ఫూర్తి పొందారు.
గ్లామర్ క్వీన్స్ పూజా ట్రావెల్ రీల్స్, డ్యాన్స్ వీడియోలతో యూత్‌ను ఆకర్షిస్తోంది. కెరీర్పరంగా కాస్త వెనకపడినా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది పూజ.
గ్లోబల్ స్టార్! RRR ఆస్కార్ సక్సెస్ తర్వాత ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా రెండింతలయ్యింది. ఉపాసనతో ఉన్న ఫొటోలు, ఫ్యామిలీ ఫోటోలు రామ్ చరణ్ ఖాతాలో ఫాలోవర్స్ని ఆకట్టుకునే అంశాలు.
రౌడీ హీరో విజయ్కి సోషల్ మీడియాలో స్ట్రాంగ్ ఫ్యాన్బేస్ ఉంది. సినిమాలతో కంటే రష్మికతో రిలేషన్ గురించే విజయ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తాడు.
సూపర్‌స్టార్ మహేష్బాబుకి బయటేకాదు, సోషల్ మీడియాలోనూ లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. ఫిట్‌నెస్, ఫోటోషూట్స్, నమ్రతతో ఫ్యామిలీ మూమెంట్స్, వెకేషన్ ఫొటోస్ని మహేష్ ఎక్కువగా ఇన్స్టాలో షేర్ చేస్తారు. SSMB29 సినిమా హైప్తో మహేష్ ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది.
బాహుబలి 1,2 సినిమాలతో పాన్ఇండియా రేంజ్లో అభిమానులను సంపాదించుకున్న డార్లింగ్ ప్రభాస్ సోషల్ మీడియాలో మాత్రం చాలా సైలెంట్. ప్రభాస్ ఖాతాలో వచ్చేవి అరాకొరా పోస్ట్లే అయినా లైక్లు, షేర్ల సంఖ్య మాత్రం కోట్లలో ఉంటుంది.
KGF 1,2 సక్సెస్‌తో పాన్-ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు కన్నడ స్టార్ యశ్. ముఖ్యంగా తెలుగులో యశ్కి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
లేడీ సూపర్‌స్టార్! జవాన్ సక్సెస్‌తో బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా తోడవ్వడంతో నయన్ ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. విఘ్నేష్ శివన్‌తో లవ్ స్టోరీ, ఫిట్‌నెస్ టిప్స్ పోస్టులు, పిల్లల ఫొటోలు నయన్ ఖాతాలో వైరల్గా మారే అంశాలు.