Sonu Sood Free ENT: కరోనా సమయంలో వలస కూలీలు దిక్కుతోచని ఉన్న పరిస్థితుల్లో తాను ఉన్నానంటూ ముందుకొచ్చారు నటుడు సోనూసూద్. అడిగిన వారికి లేదంటూ సాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎవరూ ఏ సాయం అడిగినా చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉచితంగా అంబులెన్స్‌ల నుంచి ఐఏఎస్, సీఏ, లా కోచింగ్‌లను అందిస్తూ వస్తున్నారు సోనూసూద్. ఇదిలా ఉంటే సేవ కార్యక్రమాల్లో తాజాగా సోనూ మరో అడుగు ముందుకేశారు. ఈసారి ఏకంగా ఉచితంగా ఈఎన్‌టీ సర్జరీలను అందించనున్నారు. ‘సోనూ ఛారిటీ ఫౌండేషన్’ ద్వారా ఈ సేవలు అందించనున్నట్లు సోనూసూద్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు.
ఈ సందర్భంగా సోనూ పోస్ట్ చేస్తూ.. ‘ఈఎన్‌టీ సర్జరీలను ఉచితంగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇకపై.. వాసన, రుచి, శబ్దం చక్కగా ఆస్వాదిద్దాం’ అనే క్యాప్షన్ జోడించారు. అంతేకాకుండా సేవలను ఎలా ఉపయోగించుకోవాలో దానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచారు.
* ముందుగా www.soodcharityfoundation.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
* అనంతరం ఓపెన్ అయిన పేజ్‌లో ఉచితంగా అందించే ఈఎన్‌టీ సర్జరీలకు సంబంధించి వివరాలు ఉంటాయి.
* తర్వాత రిజిస్టర్ ఆప్షన్ లేదా బార్‌కోడ్ స్కాన్ చేయాలి. వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
* అన్ని వివరాలు ఎంటర్ చేసిన సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
Anandaiah: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. కృష్ణపట్నం ఆనందయ్య కొత్త పార్టీ.. భారీ స్కేచ్..!