Son of India : నటునిగా తనను ఉత్తేజపరిచే చిత్రాలు మాత్రమే చెయ్యాలని డిసైడయ్యారు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. 560కి పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించిన ఈ లెజెండరీ యాక్టర్‌ని ఇంప్రెస్ చేసే కథలు రాయడమంటే మాములు విషయం కాదు. ఇటీవల సూర్య నటించిన ఆకాశం నీహద్దురా సినిమాలో కీలక పాత్రలో కనిపించరు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆయన టైటిల్ రోల్ పోషించనున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించనున్నారు. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 న ఈ సినిమాను అనౌన్స్ చేసారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అందులో అగ్రెసీవ్‌గా చూస్తోన్న మోహన్ బాబు లుక్ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. దేశభక్తి నేపథ్యంలో ఇలాంటి కథ తెలుగులో ఇంతవరకు రాలేదని చిత్రయూనిట్ చెప్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ జనవరి 29న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :