Yashoda: నాగ చైతన్య అభిమానులకు కోపం తెప్పిస్తోన్న యశోద పోస్టర్‌.. ఇంతకీ పోస్టర్‌లో ఏముందంటే..

|

Nov 17, 2022 | 4:35 PM

కొన్ని వార్తలను అసుల ఎవరు పుట్టిస్తారో, ఎలా పుట్టుకొస్తాయో తెలియదు కానీ తెగ వైరల్‌ అవుతుంటాయి. అసలు కాంట్రవర్సీకి అవకాశం లేని చోట కూడా ఏదో ఒక కాంట్రవర్సీని పుట్టించాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. తాజాగా యశోద సినిమా పోస్టర్‌కు సంబంధించి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వార్తే...

Yashoda: నాగ చైతన్య అభిమానులకు కోపం తెప్పిస్తోన్న యశోద పోస్టర్‌.. ఇంతకీ పోస్టర్‌లో ఏముందంటే..
Follow us on

కొన్ని వార్తలను అసుల ఎవరు పుట్టిస్తారో, ఎలా పుట్టుకొస్తాయో తెలియదు కానీ తెగ వైరల్‌ అవుతుంటాయి. అసలు కాంట్రవర్సీకి అవకాశం లేని చోట కూడా ఏదో ఒక కాంట్రవర్సీని పుట్టించాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. తాజాగా యశోద సినిమా పోస్టర్‌కు సంబంధించి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వార్తే దీనికి ఉదాహరణ చెప్పవచ్చు. పోస్టర్‌లో ఉన్న ఒక చిన్న పాయింట్‌ను పట్టుకొని.. నాగచైతన్యను ఉద్దేశించే చిత్ర యూనిట్ ఇలా చేసిందంటూ నెట్టింట కొన్ని పోస్ట్‌లు వైరల్‌ అవుతున్నాయి.

ఇంతకీ విషయమేంటంటే.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం యశోద మంచి టాక్‌ సొంతం చేసుకొని దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా సమంత కెరీర్‌లో మరో భారీ విజయంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్‌ పేరుతో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను టీవీల్లో ప్రసారం చేస్తున్నారు. అయితే ఇక్కడే కొందరు ఓ విషయాన్ని పట్టుకొని హంగామా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్‌’ (Thrilling Blockbuster)లో N,C లెటర్స్‌లో సమంత ఫొటోలు ఉండే ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. దీంతో NC అంటే నాగచైతన్య అనే అర్థమని, చిత్రయూనిట్ కావాలనే ఈ విధంగా పోస్టర్‌ను డిజైన్‌ చేసిందంటూ కొందరు స్క్రీన్‌ షాట్స్‌ తీసి పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అయితే చిత్ర యూనిట్ నిజంగా ఈ పోస్టర్‌ డిజైన్‌ విషయంలో అలా ఆలోచించిందో లేదో పక్కన పెడితే పోస్టర్‌లో అంత చిన్న పాయింట్ను ఎలా గుర్తుపట్టారు అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..