ఆకట్టుకుంటున్న ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

| Edited By:

Jul 23, 2019 | 12:08 AM

హారర్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కథనాన్ని గ్రిప్పింగ్‌గా చెప్పగలిగితే.. సినిమా విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హారర్‌ చిత్రాలకు సీజన్‌తో పని ఉండదు.. కాస్త పాజిటివ్‌ టాక్‌ వస్తే హిట్‌ గ్యారంటీ. అందుకే మన వాళ్లు హారర్‌ సినిమాలు రెగ్యులర్‌గా తెరకెక్కిస్తుంటారు. దెయ్యాలు, ఆత్మల కథలతో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు హిట్‌ అయ్యాయి. తాజాగా ఆ జాబితాలోకి చేరేందుకు ‘సిరివెన్నెల’ అనే చిత్రం రాబోతోంది. ప్రియమణి, మహానటి ఫేమ్‌ బేబి సాయి తేజస్విని […]

ఆకట్టుకుంటున్న ‘సిరివెన్నెల’ ట్రైలర్‌
Follow us on

హారర్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కథనాన్ని గ్రిప్పింగ్‌గా చెప్పగలిగితే.. సినిమా విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హారర్‌ చిత్రాలకు సీజన్‌తో పని ఉండదు.. కాస్త పాజిటివ్‌ టాక్‌ వస్తే హిట్‌ గ్యారంటీ. అందుకే మన వాళ్లు హారర్‌ సినిమాలు రెగ్యులర్‌గా తెరకెక్కిస్తుంటారు. దెయ్యాలు, ఆత్మల కథలతో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు హిట్‌ అయ్యాయి. తాజాగా ఆ జాబితాలోకి చేరేందుకు ‘సిరివెన్నెల’ అనే చిత్రం రాబోతోంది.

ప్రియమణి, మహానటి ఫేమ్‌ బేబి సాయి తేజస్విని (రాజేంద్ర ప్రసాద్‌ మనవరాలు) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్‌ పులిజాల దర్శకుడు. కమల్‌ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మాతలు. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు నీరజ్‌ పాండే ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘సినిమాలకు దూరమైన ప్రియమణి.. కేవలం ఈ కథ నచ్చే మళ్లీ నటించడానికి ఒప్పుకున్నారు. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌కి ఈ సినిమాతో శ్రీకారం చుట్టారు. ప్రియమణి నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ప్రియమణి కెరీర్‌లో ఓ వైవిధ్యభరితమైన చిత్రంగా ‘సిరి వెన్నెల’ నిలిచిపోతుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’న్నారు నిర్మాతలు.