Yodha OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సిద్ధార్థ్, రాశి ఖన్నా మూవీ ‘యోధ’.. అనుకున్న తేదీ కంటే స్ట్రీమింగ్..

|

Apr 07, 2024 | 6:44 AM

మార్చి 15న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినా.. కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సిద్ధా్ర్థ్, రాశీ ఖన్నా నటన.. డైరెక్షన్ మెప్పించాయి. ఇందులో దిశా పటానీ, రోనిత్ రాయ్, తనూజ్ విర్వాణీ, సన్నీ హిందూజ, కృతిక భరద్వాజ్ కీలకపాత్రలు పోషించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Yodha OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సిద్ధార్థ్, రాశి ఖన్నా మూవీ యోధ.. అనుకున్న తేదీ కంటే స్ట్రీమింగ్..
Yodha Movie
Follow us on

బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన సినిమా యోధ. సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా నటించింది. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. అలాగే చిత్రయూనిట్ చేసిన ప్రమోషన్స్ సినిమాపై క్యూరియాసిటిని కలిగించాయి. కానీ విడుదలయ్యాక అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మార్చి 15న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినా.. కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సిద్ధా్ర్థ్, రాశీ ఖన్నా నటన.. డైరెక్షన్ మెప్పించాయి. ఇందులో దిశా పటానీ, రోనిత్ రాయ్, తనూజ్ విర్వాణీ, సన్నీ హిందూజ, కృతిక భరద్వాజ్ కీలకపాత్రలు పోషించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈసినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక ఈనెల అంటే ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ముందుగా ఈ చిత్రాన్ని రెంటల్ పద్దతిలో అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. నిజానికి బాలీవుడ్ సినిమాలు థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ యోధ మాత్రం అనుకున్న టైమ్ కంటే ముందే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కేవలం మూడు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమాలో సిద్ధార్థ్ మరోసారి ఆర్మీ సైనికుడిగా కనిపించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ సైనికుడు అరుణ్ కత్యల్ పాత్రలో కనిపించే సిద్ధార్థ్ ఓ మిషన్ లో వైఫల్యం చెందుతాడు. దీంతో అతడిపై సస్పెన్షన్ వేటు పడుతుంది. ఆ తర్వాత అనుహ్యాంగా హైజాక్ అయిన విమానంలో కనిపిస్తాడు. అరుణ్ దేశభక్తి ఉన్న సైనికుడా ? లేదా దేశ ద్రోహా ? అనే సందేహాలతో యోధ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, మెంటార్ డీసీపీల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాయి. మార్చి 15న విడుదలైన ఈమూవీ దాదాపు రూ.31 కోట్లు రాబట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.