Shruthi Haasan: పెళ్లిపై షాకింగ్‌ కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్‌.. వివాహ బంధంపై నమ్మకమున్నా..

|

Jun 06, 2022 | 4:20 PM

Shruthi Haasan: ఇదిలా ఉంటే సినిమాలతో పాటు అప్పుడప్పుడు వ్యక్తిగత జీవిత విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది శ్రుతి. తన బాయ్‌ఫ్రెండ్‌ శాంతను హజారికాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆమె..

Shruthi Haasan: పెళ్లిపై షాకింగ్‌ కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్‌.. వివాహ బంధంపై నమ్మకమున్నా..
Shruthi Haasan
Follow us on

Shruthi Haasan: యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ (Kamal Haasan) వారసురాలిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శ్రుతిహాసన్‌ (Shruthi Haasan). ఆతర్వాత తన సొంత ట్యాలెంట్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా, సింగర్‌గానూ సత్తా చాటుతోంది. మధ్యలో వ్యక్తిగత కారణాలతో సిల్వర్‌ స్ర్కీన్‌కు దూరంగా ఉన్నా గతేడాది క్రాక్‌, వకీల్‌ సాబ్‌లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమాలు అందుకుని ఘనంగా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తన చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. బాలయ్య హీరోగా ‌గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న సినిమాలో శ్రుతి హీరోయిన్‌గా ఎంపికైంది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రంలోనూ ఈ అందాల తారనే కథానాయికగా తీసుకున్నారు. ఇక పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తోన్న సలార్‌ (salaar) లోనూ ఈ అమ్మడే హీరోయిన్‌. ఇదిలా ఉంటే సినిమాలతో పాటు అప్పుడప్పుడు వ్యక్తిగత జీవిత విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది శ్రుతి. తన బాయ్‌ఫ్రెండ్‌ శాంతను హజారికాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆమె.. అతనితో దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. ఈనేపథ్యంలో రిలేషన్‌షిప్‌, పెళ్లిపై స్పందించిన శ్రుతి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది.

పెళ్లంటేనే భయమేస్తోంది..
‘నాకు పెళ్లంటేనే భయమేస్తోంది. నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని నేను ఈ మాట చెప్పడం లేదు. నాకు వివాహ బంధంపై ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ లోలోపల భయం మాత్రం ఉంది. పైగా శాంతను నా జీవితంలోకి అడుగుపెట్టాక నా వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా విషయాల్లో మా ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి’ అని చెప్పుకొచ్చింది శ్రుతి. శ్రుతి తల్లిదండ్రులు కమల్, సారిక విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆతర్వాత కమల్‌ గౌతమితో కొన్నేళ్ల పాటు సహజీవనం చేశారు. ఆతర్వాత వారు కూడా విడిపోయారు. కాగా వివాహ బంధంపై శ్రుతి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Bonalu 2022: తెలంగాణలో బోనాల జాతర.. 30న గోల్కొండలో అమ్మవారికి తొలి బోనం..

Spark Movie: స్పార్క్ సినిమా కోసం హృదయం మూవీ మ్యూజిక్ డైరెక్టర్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్..

F3 Movie collections: నవ్వుల బొనాంజాకు బాగా కలిసొచ్చిన వీకెండ్‌.. మొత్తం10 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే..