వెంటనే నా కలలోకి వచ్చిన సుశాంత్‌ ఏం చెప్పాడంటే

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసుపై నటి రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

వెంటనే నా కలలోకి వచ్చిన సుశాంత్‌ ఏం చెప్పాడంటే

Updated on: Aug 30, 2020 | 4:50 PM

Sushant Death case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసుపై నటి రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సుశాంత్ కుటుంబ సభ్యులతో పాటు కొందరు సన్నిహితులు, అతడి దగ్గర పనిచేసిన మాజీ సిబ్బంది రియాపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రియా.. సుశాంత్‌ ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ కుటుంబం అతడిని పట్టించుకోలేదని, డిప్రెషన్‌ నుంచి అతడిని బయటకు తెచ్చేందుకు తాను చాలా ప్రయత్నాలు చేశానని మాట్లాడింది. అంతేకాదు తనపై ఎంత నెగిటివిటీ జరుగుతున్నా తాను మీడియా ముందుకు రాలేదని, కానీ సుశాంత్ ఇటీవల కలలోకి వచ్చి.. మీడియా ముందుకు వెళ్లు అని చెప్పడంతో వచ్చానంటూ వెల్లడించింది.

అయితే ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు, నిర్మాత శేఖర్ సుమన్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ఆమె నటనను చూసి ఎమోషనల్‌గా కూడా ముగ్ధుడిని అయ్యాను. ఆమె కన్నీళ్లను చూసి బరువెక్కిన గుండెతో ఉన్నాను. అదే సమయంలో అనుకోకుండా సుశాంత్ నా కలలోకి వచ్చాడు. ఆమె చెప్పింది నమ్మకు అని చెప్పాడు అంటూ రియా పేరును ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు.

అంతేకాదు రియాపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శేఖర్ సుమన్.. ”తన కలలోకి సుశాంత్‌ వచ్చి.. ఇంటర్వ్యూ ఇచ్చి నిజం చెప్పు అని చెప్పాడంటూ ఆమె వెల్లడించింది. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే.. అతడిపై నీకు చాలా ప్రేమ ఉంది. మరోవైపు చాలా మంది నిన్ను ప్రశ్నిస్తున్నారు. నిన్ను నిందితురాలిగా పేర్కొంటున్నాను. ఇంకా చెప్పాలంటే దోషి అంటున్నారు. మరి ఇన్ని రోజులు నువ్వు సైలెంట్‌గా ఎందుకు ఉన్నావు. నీ కలలోకి రావడానికి సుశాంత్ ఎందుకు అంత సమయం తీసుకున్నాడు” అని ప్రశ్నించారు.

Read More:

కోలుకున్న వారికి మళ్లీ కరోనా.. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే

దీపక్ చాహర్‌కి కరోనా.. వైరల్ అవుతోన్న పాత సంభాషణ

Loading...
Unable to load recommendations.
Follow Us