హైదరాబాద్: శర్వానంద్ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికలు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. తొలుత ఆగష్టు 2న విడుదల చేయాలనుకున్న నిర్మాతలు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఒక క్రిమినల్ ఎలా మాఫియా లీడర్‌గా మారాడన్న నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.