Oke Oka Jeevitham: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న శర్వా సూపర్ హిట్ మూవీ.. ఒకేఒక జీవితం స్ట్రీమింగ్ ఎక్కడంటే..

గత కొంతకాలంగా హిట్స్ లేక సతమతం అవుతున్నాడు శర్వా. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. చివరగా ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ అందుకున్నాడు.

Oke Oka Jeevitham: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న శర్వా సూపర్ హిట్ మూవీ.. ఒకేఒక జీవితం స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Oke Oka Jeevitham

Updated on: Oct 20, 2022 | 6:56 AM

యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం. చాలాకాలం తర్వాత శర్వానంద్ ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక సతమతం అవుతున్నాడు శర్వా. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. చివరగా ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ అందుకున్నాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా డైరెక్టర్ శ్రీకార్తిక్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో రీతూ వర్మ కథానాయికగా నటించగా.. అక్కినేని అమల.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలలో నటించారు. విడుదలైన మొదటి రోజే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ మూవీ. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయ్యింది.

ఒకే ఒక జీవితం సినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ లో శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమా ఈ రోజు ( అక్టోబర్ 20)నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

టైం ట్రావెల్‌ నేపథ్యానికి మదర్ సెంటిమెంట్‌ జోడించి శ్రీ కార్తిక్‌ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా శర్వానంద్- అమలల నటనకు అందరూ ఫిదా అవుతున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో కణం పేరుతో విడుదలైంది. సైన్స్‌ ఫిక్షన్‌ ఎమోషనల్‌ డ్రామాగా ఆకట్టుకుంటోన్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చగా అమ్మ పాట బాగా హిట్టైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..