ప్రభాస్ ఫోన్ కాల్..షాహిద్‌‌లో యమ జోష్‌

ముంబయి: టాలీవుడ్ బాహుబలి నుంచి బాలీవుడ్ యువ హీరోకి ఫోన్ వెళ్లింది. దాంతో ఆ హీరో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇంతకీ ఆ బాలీవుడ్ నటుడు ఎవరు అనుకుంటున్నారా? అదే కబీర్ సింగ్..అయ్యో ఇంకా అర్థం కాలేదా? షాహిద్ కపూర్ అండీ. యంగ్ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ తనకు ఫోన్‌ చేసినప్పుడు ఎంతో సంబరపడిపోయానని అంటున్నారు ఈ  బాలీవుడ్‌ హీరో . తాను కథానాయకుడిగా నటించిన ‘కబీర్‌ సింగ్’ మూవీ టీజర్‌ విడుదలైనప్పుడు ప్రభాస్‌ ఎంతో మెచ్చుకున్నాడని షాహిద్ […]

ప్రభాస్ ఫోన్ కాల్..షాహిద్‌‌లో యమ జోష్‌

Edited By:

Updated on: Apr 26, 2019 | 7:33 PM

ముంబయి: టాలీవుడ్ బాహుబలి నుంచి బాలీవుడ్ యువ హీరోకి ఫోన్ వెళ్లింది. దాంతో ఆ హీరో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇంతకీ ఆ బాలీవుడ్ నటుడు ఎవరు అనుకుంటున్నారా? అదే కబీర్ సింగ్..అయ్యో ఇంకా అర్థం కాలేదా? షాహిద్ కపూర్ అండీ. యంగ్ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ తనకు ఫోన్‌ చేసినప్పుడు ఎంతో సంబరపడిపోయానని అంటున్నారు ఈ  బాలీవుడ్‌ హీరో . తాను కథానాయకుడిగా నటించిన ‘కబీర్‌ సింగ్’ మూవీ టీజర్‌ విడుదలైనప్పుడు ప్రభాస్‌ ఎంతో మెచ్చుకున్నాడని షాహిద్ సంబరపడిపోతున్నాడు. ‘అర్జున్‌ రెడ్డి’ కంటే ‘కబీర్‌ సింగ్’ బాగుందని ప్రభాస్‌ అభిప్రాయపడ్డారని చెప్పుకొచ్చాడు. దీని గురించి షాహిద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌కు, నాకూ ఒకే హెయిర్‌ స్టైలిస్ట్‌ ఉన్నాడు. అతని పేరు ఆలిమ్‌ హకీమ్‌. వారిద్దరూ ‘కబీర్‌ సింగ్‌’ టీజర్‌ గురించి చర్చించుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్‌ నాకు కంగ్రాట్స్‌ చెప్పడానికి ఫోన్‌ చేశారు. దాదాపు పది నిమిషాలు మాట్లాడారు. ఎంతో సంబరపడిపోయాను’ అని తెలిపారు. ఓ టాలీవుడ్ హీరో ఫోన్ కాల్‌కి బాలీవుడ్ హీరో ఇలా రెస్పాండ్ అయ్యాడంటే..ఇదంతా బాహుబలి మహత్యం కాదా? అంటున్నారు ట్రేడ్ పండితులు.