RGV: భీమ్లా నాయక్‌పై సెటైర్లు.. పవన్‌ ఫ్యాన్స్‌ను మరోసారి కవ్వించిన రామ్‌గోపాల్‌ వర్మ..

|

Feb 22, 2022 | 11:12 AM

RGV: రామ్‌గోపాల్‌ వర్మ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం తనని తాను వార్తల్లో ఉండేలా చూసుకోవడం వర్మకు మాత్రమే దక్కుతుంది. సందర్భం ఏదైనా మధ్యలో దూరడం వర్మ స్టైల్‌. ఇదే కొన్ని సార్లు కాంట్రవర్సీలకు దారి తీస్తుంటుంది. ఇక పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌పై...

RGV: భీమ్లా నాయక్‌పై సెటైర్లు.. పవన్‌ ఫ్యాన్స్‌ను మరోసారి కవ్వించిన రామ్‌గోపాల్‌ వర్మ..
Rgv Tweet
Follow us on

RGV: రామ్‌గోపాల్‌ వర్మ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం తనని తాను వార్తల్లో ఉండేలా చూసుకోవడం వర్మకు మాత్రమే దక్కుతుంది. సందర్భం ఏదైనా మధ్యలో దూరడం వర్మ స్టైల్‌. ఇదే కొన్ని సార్లు కాంట్రవర్సీలకు దారి తీస్తుంటుంది. ఇక పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌పై (Pawan Kalyan) నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ కాంట్రవర్సీలకు దారి తీసే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్‌’ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌పై తనదైన శైలిలో స్పందించిన వర్మ.. మరోసారి చర్చకు తెర తీశాడు.

ఇంతకీ వర్మ ఏమన్నారంటే.. ‘భీమ్లా నాయక్‌ ట్రైలర్‌ విషయానికొస్తే.. బాలీవుడ్‌లో పవన్‌కళ్యాణ్‌ కంటే రానాకే ఎక్కువ పాపులారిటీ ఉంది, దీనికి కారణం బాహుబలి. ఈ సినిమాలో రానా విలన్‌గా కాకుండా హీరోగా కనిపించే అవకాశం ఉంది’ అంటూ రాసుకొచ్చాడు. అంతటితో ఆగని వర్మ.. మరో ట్వీట్‌లో ‘భీమ్లా నాయక్‌ ట్రైలర్‌ చూస్తుంటే మూవీ యూనిట్‌ రానా పాపులారిటీ పెంచడానికే పవన్‌ కళ్యాణ్‌ను తగ్గించినట్లు కనిపిస్తోంది. పవన్‌ అభిమానిగా నేను చాలా హర్ట్‌ అయ్యాను’ అంటూ రాసుకొచ్చారు. వర్మ చేసిన ఈ స్టేట్‌మెంట్స్‌పై పవన్‌ అభిమానులు గరంగరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే పవన్‌ను వర్మ టార్గెట్‌ చేయడం ఇదే తొలిసారి గతంలోనూ పలుసార్లు చేసిన ట్వీట్స్‌ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.


Also Read: త్వరలో ఫోన్‌ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదు.. బట్‌.. షరతులు వర్తిస్తాయి !! వీడియో

Hair Care Tips: తల బాగా దురద పెడుతోందా? అయితే అలోవెరాతో ఇలా ఉపశమనం పొందండి..

Bindu Madhavi : బిగ్ బాస్ తో తిరిగి తెలుగులో బిజీ అవ్వాలని చూస్తున్న బిందుమాధవి