ANNAPURNA ABOUT CASTING COUCH : టాలీవుడ్‌లో విలక్షణమైన నటనతో తనకంటు ఓ గుర్తింపు సంపాదించుకున్న నటి అన్నపూర్ణ. తల్లి పాత్రలో, భార్య పాత్రలో ఇట్టే ఒదిగిపోతుంది. తను నటించిన సినిమాలలో కొన్ని పాత్రలు ఆమె మాత్రమే చేయగలరు అనేవి చాలా ఉన్నాయి. పాతతరం నటులతో, ఇటు కొత్తతరం నటులలో అందరికి గుర్తుండే పేరు అన్నపూర్ణ. నటిగా, కథానాయికగా, సహాయనటిగా ప్రేక్షకులకు చేరువైన అన్నపూర్ణ ప్రస్తుతం ‘ఎఫ్-3’లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ..తప్పు అనేది ఎప్పుడూ ఒకరి వైపే ఉండదని.. ఇద్దరికీ ఇష్టమైతేనే కొన్ని తప్పులు జరుగుతాయని పేర్కొన్నారు. నాటకాల నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టానని, కెరీర్ ఆరంభంలోనే తన పేరు ఉమా అని తర్వాత అన్నపూర్ణగా మార్చుకున్నానని తెలిపారు. నటిగా, కథానాయికగా, అంతేకాకుండా పలువురు నటీనటులకు తల్లి పాత్రలో నటించానని.. కలిసి పనిచేసిన నటీనటులందరూ తనను గౌరవించారని తెలిపారు.
‘క్యాస్టింగ్ కౌచ్ అనేది అనవసరపు వ్యవహారమని, ప్రతిరంగంలోనూ మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. ఇళ్లు, కుటుంబం, గౌరవం అనే వాటిని దృష్టిలో ఉంచుకుని వేటికి లొంగకుండా మహిళలు తప్పించుకు వచ్చేస్తున్నారు. అదే మాదిరిగా ఇక్కడివాళ్లు కూడా తప్పించుకుపోవాలన్నారు. ఒకవేళ అలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే నోరు విప్పాలి. తప్పులు జరగవని తాను చెప్పనని, ఇద్దరికీ ఇష్టమైతేనే కొన్ని తప్పులు జరుగుతాయని అన్నారు. అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్లకి కచ్చితంగా కష్టాలు ఉంటాయని చెప్పారు.