Anukoni Prayanam: ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి.. ‘అనుకోని ప్రయాణం’ సక్సెస్‌పై రాజేంద్ర ప్రసాద్‌..

|

Oct 30, 2022 | 8:37 PM

సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'అనుకోని ప్రయాణం'. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 28వ తేదీన విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. వెంకటేష్‌ పెదిరెడ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పాజిటివ్‌ బజ్‌తో దూసుకుపోతోంది...

Anukoni Prayanam: ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి.. అనుకోని ప్రయాణం సక్సెస్‌పై రాజేంద్ర ప్రసాద్‌..
Anukoni Prayanam
Follow us on

సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘అనుకోని ప్రయాణం’. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 28వ తేదీన విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. వెంకటేష్‌ పెదిరెడ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పాజిటివ్‌ బజ్‌తో దూసుకుపోతోంది. కరోనా సమయంలో చనిపోయిన తన స్నేహితుడి శవాన్ని సొంతూరుకి తీసుకెళ్లడానికి రాజేంద్రప్రసాద్‌కు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి. బంధాలు, అనుబంధాలపై పెద్దగా నమ్మకం ఉండని వ్యక్తి జీవితంలో ఎదురైన సంఘటనలు అతన్ని ఎలా మార్చాయన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

అనుకోని ప్రయాణానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ తాజాగా సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒక మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో ‘అనుకోని ప్రయాణం’ మరోసారి రుజువు చేసింది. ‘అనుకోని ప్రయాణం’ ఇంత అద్భుతమైన టాక్ రావడానికి కారణమైన ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాకపోవడమే ఈ సినిమాకి ఫస్ట్ సక్సెస్. ‘అనుకోని ప్రయాణం’ అందరూ తప్పక చూడాల్సిన సినిమా. మానవ విలువలు తగ్గిపోతున్న కాలంలో వాటిని గుర్తు చేస్తూ అద్భుతంగా ఈ కథని తీశాం. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ‘అనుకోని ప్రయాణం’ చూశాక ప్రేక్షకులు గొప్ప ఫీలింగ్ ని ఇంటివరకూ తీసుకెళ్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమాలో సాంకేతిక నిపుణులంతా కొత్త వాళ్లని, కొత్త వాళ్లంతా కలిసి ఒక అద్భుతమైన కథ చేసి ప్రేక్షకులు తీసుకొస్తే ప్రేక్షకులు చాలా చక్కగా ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివ్ రివ్యూలు ఏ సినిమాకి రాలేదన్న రాజేంద్ర ప్రసాద్‌… ప్రేక్షకులు ఆదరణకు కృతజ్ఞతలంటూ తెలిపారు. ఇక అనుకోని ప్రయాణం చిత్రాన్ని ఇతర భాషల్లోనూ డబ్‌ చేస్తున్నట్లు రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..