AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhediya: కృతి సనన్‌తో కలిసి స్టెప్పులేసి వరుణ్ ధావన్.. బేడియా నుంచి అదిరిపోయే సాంగ్

ఈ చిత్రాన్ని తొలి క్రియేచర్ కామెడీ మూవీగా దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కిస్తున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దినేష్ విజాన్ నిర్మాత.

Bhediya: కృతి సనన్‌తో కలిసి స్టెప్పులేసి వరుణ్ ధావన్.. బేడియా నుంచి అదిరిపోయే సాంగ్
Varun Dhawan, Kriti Sanon
Rajeev Rayala
|

Updated on: Oct 30, 2022 | 9:18 PM

Share

బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా బేడియా. ఈ చిత్రాన్ని తొలి క్రియేచర్ కామెడీ మూవీగా దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కిస్తున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దినేష్ విజాన్ నిర్మాత. హిందీతో పాటు తెలుగులో “తోడేలు” టైటిల్ తో నవంబర్ 25న రిలీజ్ కాబోతోంది. తాజాగా బేడియా సినిమా నుంచి తుంకేశ్వరి అనే పాటను విడుదల చేశారు. డాన్స్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాట ఫిల్మ్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. తుంకేశ్వరి పాటలో వరుణ్, కృతి డాన్సులు ఆకర్షణ అయ్యాయి. ఈ పాటలో స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ చేసిన స్పెషల్ అప్పీయరెన్స్ అసలైన హైలైట్ గా చెప్పుకోవచ్చు. సచిన్ జిగర్ స్వరపర్చిన ఈ పాటకు గణేష్ ఆచార్య అదిరిపోయే స్టెప్పులు కొరియోగ్రాఫ్ చేశారు. ఈ పాటను తెలుగు లో కార్తీక్, అనూష మణి ఆలపించారు.

ఈ పాట గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ…ఫ్లోర్ అదిరిపోయే డాన్స్ నెంబర్ ఇది. థియేటర్ లో ఆడియెన్స్ ఈ పాటకు స్టెప్పులేస్తారు. ఈ పాటలో పర్మార్మ్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. క్యాచీ లిరిక్స్, మంచి ట్యూన్ తో పాట మీకు బాగా నచ్చుతుంది. అన్నారు. కృతి సనన్ మాట్లాడుతూ..వరుణ్ సరసన ఇలాంటి పాటలో కనిపించి చాలా రోజులవుతోంది. ఈ పాట షూటింగ్ టైమ్ ను ఎంజాయ్ చేశాం. ఇదొక మంచి ఎక్సీపిరియన్స్. అని చెప్పింది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే తోడేలు కరిచిన తర్వాత హీరో భాస్కర్ ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకునేందుకు అతని స్నేహితులు ప్రయత్నిస్తుంటారు. తోడేలులా మారిన అతని వైల్డ్ బిహేవియర్ కు కారణాలేంటో తెలుసుకునే క్రమం అంతా ఆసక్తికర అంశాలతో సర్ ప్రైజింగ్ గా సాగుతుంది. ఈ కథను అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్రీడీ ఫార్మేట్ లోనూ ఈ సినిమా విడుదలవుతుండటం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారిన విండోస్‌ 11సమస్య.. ఏంటది?
వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారిన విండోస్‌ 11సమస్య.. ఏంటది?
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు