తండ్రి పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు తదుపరి చిత్రంలో నటిస్తుండగా ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రీలుక్‌ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ లుక్ మహేష్ ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రీలుక్‌లో మహేష్ చెవికి పోగు, మెడపై రూపాయి టాటూపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో టాటూ సీక్రెట్ తెలుసుకునేందుకు మహేష్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో ఈ టాటూ వెనుక కథ ఇదేనంటూ ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ వర్గాల ప్రకారం.. మొదట ఆ స్థానంలో డాలర్ టాటూను పెట్టాలనుకున్నారట. స్క్రిప్ట్ ప్రకారంగా ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో చేయాలని భావించిన దర్శకుడు మహేష్ మెడపై డాలర్ టాటూను వేయించాలనుకుంటున్నారట. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పుడు మూవీ షూటింగ్‌ని భారత్‌లోనే జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ క్రమంలో రూపాయి టాటూను మార్చినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోనుండగా.. అక్టోబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందించనున్నారు.
Read This Story Also: Breaking: నిమ్మగడ్డ కేసు.. సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం