Nithiin Power Peta: టాలీవుడ్ యువ హీరో నితిన్ వరుస సినిమాలను లైన్‌లో ఉంచుకున్నారు. ప్రస్తుతం రంగ్‌దేతో పాటు చెక్‌లో నటిస్తోన్న ఈ నటుడు.. ఆ తరువాత మేర్లపాక గాంధీ, కృష్ణ చైతన్య డైరెక్షన్‌లలో నటించనున్నారు. అయితే ఈ ఇద్దరు దర్శకులు తెరకెక్కించే చిత్రాలు రీమేక్‌లు కావడం విశేషం. మేర్లపాక గాంధీ అంధధూన్ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తుండగా.. కృష్ణ చైతన్య పుదుపెట్టైని రీమేక్ చేస్తున్నారు. ఈ రెండింటికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే పుదుపెట్టై రీమేక్‌లో నితిన్ సరసన కీర్తి సురేష్ మరోసారి రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోయే ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం టాలెంటెడ్ నటుడు సత్యదేవ్‌ని సంప్రదించినట్లు సమాచారం. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు పలువురు హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు సత్యదేవ్. ఈ క్రమంలోనే పవర్ పేటలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే పవర్‌పేటకు సత్యదేవ్ మరో అదనపు ఆకర్షణ అవ్వనున్నారు.
Read More:
డ్రగ్స్ కేసు: ప్రముఖ నటుడి భార్యకు సమన్లు.. విచారణకు గైర్హాజరు