MeToo: కంగనా ఆరోపణలపై స్పందించిన ‘దిల్‌ బేచారే’ నటి

సుశాంత్‌ ఆత్మహత్య విషయంలో ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేశారు బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్‌.

MeToo: కంగనా ఆరోపణలపై స్పందించిన దిల్‌ బేచారే నటి

Edited By:

Updated on: Jul 25, 2020 | 6:32 PM

Sanjana Sanghi answers Kangana Ranaut’s claims: సుశాంత్‌ ఆత్మహత్య విషయంలో ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేశారు బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్‌. ఈ క్రమంలో సుశాంత్‌ సహ నటి, దిల్‌ బేచారే హీరోయిన్ సంజనా సంఘిపై కంగనా టీమ్‌ కొన్ని ఆరోపణలు చేసింది. 2018 సంవత్సరంలో సంజనా సంఘి, సుశాంత్‌పై మీటూ ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. సెట్‌లో సుశాంత్‌, సంజనాపై ఓవర్ కేర్‌ తీసుకునే వాడని, దాంతో ఆమె కాస్త ఇబ్బందిగా ఫీల్ అయిందని కొన్ని పుకార్లు నడిచాయి. అయితే ఆ వార్తలపై అప్పట్లో క్లారిటీ ఇచ్చారు సంజనా. కాగా ఈ ఆరోపణలపై సంజనా చాలా ఆలస్యంగా స్పందించారని కంగనా టీమ్‌ ట్విట్టర్‌లో ప్రశ్నించింది.

వాటికి తాజాగా క్లారిటీ ఇచ్చారు దిల్ బేచారే నటి. ”పుకార్లపై నేను ఎప్పుడు స్పందించానన్న విషయంపై నన్ను జడ్జ్‌ చేసే అథారిటీ ఎవ్వరికీ లేదు. అసలు ఏం జరిగిందన్న దానిపై నేను చాలానే చెప్పాను. ఆ సమయంలో నేను ఆలస్యాన్ని చూపలేదు. ఏది ఆలస్యం..? ఏది ఆలస్యం కాదు..? అని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు. రూమర్లకు నువ్వు ఆజ్యం పోయాల్సిన అవసరం లేదు. రూమర్లపై క్లారిటీ ఇవ్వడం బాధ్యత లేదా జాబ్‌ కాదు” అని అన్నారు. అంతేకాకుండా ఒక పుకారుపై ఇద్దరు స్పష్టతను ఇచ్చినప్పుడు అది మీటూ అవ్వదని.. కేవలం గాసిప్ మాత్రమే అవుతుందని సంజనా చెప్పుకొచ్చారు. ఈ విషయంలో క్లారిఫికేషన్‌ ఇవ్వాల్సిన అవసరం తనకు, సుశాంత్‌కు అప్పట్లో చాలా ముఖ్యం కాబట్టి.. అందుకే ఇద్దరం ఇచ్చామని వివరించారు.