ఇన్‌స్టా పోస్ట్‌తో అమలకు కౌంటర్ ఇచ్చిన సమంత..!

అక్కినేని కుటుంబంలో కోల్డ్ వార్. ఫిలింనగర్ వర్గాల్లో ఎప్పటినుంచో వినిపిస్తోన్న వార్త. నాగార్జున కుటుంబంతో చై-శామ్‌లు ఇద్దరు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని టాక్‌ నడుస్తూనే ఉంది.

ఇన్‌స్టా పోస్ట్‌తో అమలకు కౌంటర్ ఇచ్చిన సమంత..!

Edited By:

Updated on: Apr 25, 2020 | 12:31 PM

అక్కినేని కుటుంబంలో కోల్డ్ వార్. ఫిలింనగర్ వర్గాల్లో ఎప్పటినుంచో వినిపిస్తోన్న వార్త. నాగార్జున కుటుంబంతో చై-శామ్‌లు ఇద్దరు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని టాక్‌ నడుస్తూనే ఉంది. దానికి తోడు ఇటీవల అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సమంత, చైతన్య ఇద్దరూ అతడికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలను చెప్పలేదు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమల, సమంత మీకు వంట చేసి పెడుతుందా..? అన్న ప్రశ్నకు తమ ఇంట్లో నాగార్జున బాగా వంటలు చేస్తారని. అలాంటప్పుడు ఇంకొకరు ఎందుకంటూ కామెంట్లు చేశారు. అంతేకాదు అక్కినేని కుటుంబంలో ఆడవాళ్లు ఎవరూ వంటలు చేయరని ఆమె అన్నారు.

కాగా తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ట్రప్ఫెల్ మస్రూమ్‌ పాస్తాను తయారు చేసిన అక్కినేని కోడలు ఆ పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో అమలకు కౌంటర్ ఇచ్చేందుకే సమంత ఆ పోస్ట్ చేసిందా..! అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

Read This Story Also: Breaking:ప్రారంభమైన రంజాన్ మాసం.. లాక్‌డౌన్‌ పొడిగింపు..!