Samantha Akkineni: ఫ్యాన్స్‌కు థాంక్స్ చెబుతున్న సామ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

|

Feb 06, 2021 | 2:28 PM

Samantha Akkineni: బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత అడుగుపెట్టిన ప్రతీచోట విజయాన్ని అందుకుంటోంది. మూవీస్, హోస్టింగ్, వెబ్ సిరీస్, బిజినెస్.. ఇలా అన్ని

Samantha Akkineni: ఫ్యాన్స్‌కు థాంక్స్ చెబుతున్న సామ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Follow us on

Samantha Akkineni: బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత అడుగుపెట్టిన ప్రతీచోట విజయాన్ని అందుకుంటోంది. మూవీస్, హోస్టింగ్, వెబ్ సిరీస్, బిజినెస్.. ఇలా అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. ఇక సోషల్ మీడియాలోనైతే ఆమె క్రేజ్ మామూలుగా లేదు. తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 1.50 కోట్లను దాటడమే అందుకు నిదర్శనం. దీంతో సమంత తన ఫ్యాన్స్‌కు థాంక్స్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది.

‘ఇప్పుడే షూటింగ్ పూర్తి చేశాను. నాకో సర్‌ప్రైజ్ వచ్చినట్టు తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ ఫాలోవర్స్.. లైక్‌లు, కామెంట్లతో నన్నెంతగానో ప్రోత్సహించిన నా ఇన్‌స్టాగ్రామ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. మరింత ఉన్నతంగా పని చేయాలనే స్ఫూర్తిని కలిగించారు. లవ్యూ ఆల్’ అని వీడియోలో పేర్కొంది సామ్. ఇక తను మెయిన్ విలన్ రోల్ ప్లే చేసిన ‘ది ఫ్యామిలీ మాన్ 2’ సిరీస్‌ త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.