ఆ చిత్రంలో తేజు రోల్ ఇదేనట..?

|

Mar 18, 2019 | 4:07 PM

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన కొత్త చిత్రం ‘చిత్రలహరి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఏప్రిల్ 12 న విడుదల కానున్న ఈ చిత్రంపై తేజు చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత దర్శకుడు మారుతీ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో తేజు […]

ఆ చిత్రంలో తేజు రోల్ ఇదేనట..?
Follow us on

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన కొత్త చిత్రం ‘చిత్రలహరి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఏప్రిల్ 12 న విడుదల కానున్న ఈ చిత్రంపై తేజు చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత దర్శకుడు మారుతీ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో తేజు లాయర్ గా నటించనున్నాడని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే లాంచ్ కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఒకవేళ అదే జరిగితే వారిద్దరి కాంబినేషన్ లో వచ్చే రెండో చిత్రం ఇది.