Virupaksha Teaser: విరూపాక్ష టీజర్‌ వచ్చేసింది.. చూస్తున్నంత సేపు ఊపిరి బిగపట్టాల్సిందే..

|

Mar 02, 2023 | 6:53 PM

మెగా హీరో సాయితేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం విరూపాక్ష. తేజ్‌ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తోన్న తొలి చిత్రం ఇదే. టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ అంచనాలు పెరిగాయి. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్‌కు జోడిగా సంయుక్త మీనన్‌..

Virupaksha Teaser: విరూపాక్ష టీజర్‌ వచ్చేసింది.. చూస్తున్నంత సేపు ఊపిరి బిగపట్టాల్సిందే..
Virupaksha Telugu Teaser
Follow us on

మెగా హీరో సాయితేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం విరూపాక్ష. తేజ్‌ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తోన్న తొలి చిత్రం ఇదే. టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ అంచనాలు పెరిగాయి. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్‌కు జోడిగా సంయుక్త మీనన్‌ నటిస్తోంది. బ్లాక్‌ మ్యాజిక్‌ వంటి ఇంట్రెస్టింగ్‌ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.

సినిమా కథ ఏంటన్నదానిపై అందరిలో క్యూరియాసిటీ పెంచేసిందీ మూవీ. ఇదిలా ఉంటే పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 21న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో కూడా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌ షురూ చేసిన చిత్ర యూనిట్ తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేసింది. 1.19 నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్‌ చూస్తున్నంత సేపు ఊపిరి బిగపట్టుకొని చూసేలా టీజర్‌ ఉంది.

ఇవి కూడా చదవండి

టీజర్‌లో వచ్చే ‘చరిత్రలో ఇలాంటి ఒక సంఘటన జరగడం ఇదే మొదటిసారి. దీని నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది’. ‘సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం అక్కడే వెతకాలి’. ‘ఆ ప్రమాదం దాటడానికే నా ప్రయాణం’ అనే డైలాగ్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉన్నాయి. ఇక బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ టీజర్‌కు మరింత హైప్‌ తీసుకొచ్చిందని చెప్పాలి. మరి పాజిటివ్‌ బజ్‌తో వస్తోన్న ఈ సినిమా తేజ్‌ కెరీర్‌ను ఎలంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..