పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్..!

| Edited By:

Mar 20, 2019 | 11:04 AM

మెగా మేనల్లుడిగా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీని ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఆ ఊపులో వరుస విజయాలు కూడా పడటంతో సాయి ధరమ్ తేజ్ మార్కెట్ పెరుగుతూ వచ్చింది. అయితే ‘తిక్క’ నుంచి ఈ హీరో గ్రాఫ్ పడిపోయింది. వరుసగా ఆరు పరాజయాలను చూశాడు సాయి ధరమ్. అందులో రెండు, మూడు భారీ ఫ్లాప్‌లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న సాయి ధరమ్ తేజ్ పేరును కూడా మార్చుకున్నట్లు తెలుస్తోంది. కిశోర్ […]

పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్..!
Follow us on

మెగా మేనల్లుడిగా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీని ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఆ ఊపులో వరుస విజయాలు కూడా పడటంతో సాయి ధరమ్ తేజ్ మార్కెట్ పెరుగుతూ వచ్చింది. అయితే ‘తిక్క’ నుంచి ఈ హీరో గ్రాఫ్ పడిపోయింది. వరుసగా ఆరు పరాజయాలను చూశాడు సాయి ధరమ్. అందులో రెండు, మూడు భారీ ఫ్లాప్‌లు కూడా ఉన్నాయి.

అయితే ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న సాయి ధరమ్ తేజ్ పేరును కూడా మార్చుకున్నట్లు తెలుస్తోంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ధరమ్ ‘చిత్రలహరి’లో నటించగా.. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ మంగళవారం విడుదలైంది. అందులో సాయి తేజ్ అనే పేరు కనిపిస్తోంది. దీంతో విజయం కోసం ధరమ్ తేజ్ పేరు మార్చుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మరి పేరు మార్పు సాయి తేజ్‌కు ఎలాంటి ఫలితాన్ని తీసుకొస్తుందో చూడాలంటే ఏప్రిల్ 12వరకు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ నటించగా సునీల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల వచ్చిన టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.